English | Telugu

 రుద్రపై శకుంతల ఫైర్.. పెద్దసారు కూడా ఏం చేయలేకపోయాడుగా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -93 లో......మణి పైడిరాజు ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తారు . నేను మీ కూతురిని ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను. నిద్రలో ఉంది కదా వెళ్లి తాళి కడతానని మణి చెప్పగానే పైడిరాజు సరే అంటాడు. ఆ తర్వాత గంగ నిద్రపోతుంటే మణి వచ్చి తాళి కట్టాలని అనుకుంటాడు. కానీ గంగని చూసి పెళ్లి తర్వాత మొదట శోభనం చేసుకుందామని తన దగ్గరికి వెళ్తాడు.

మరొకవైపు రుద్ర ఇంట్లో ఉన్న సూర్యని చంపడానికి సైదులు వెళ్తాడు. సూర్య అనుకోని రుద్ర దగ్గరికి వెళ్లి కత్తితో పొడవబోతుంటే రుద్ర ఆపుతాడు. సైదులు అక్కడ నుండి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. మరొక వైపు గంగ దగ్గరికి మణి వెళ్లి తనని ముట్టుకోబుతుంటే తన కడుపులో ఏదో ప్రాబ్లమ్ అయి ఆగిపోతాడు. ఆ తర్వాత సైదులు వెళ్లిపోతుంటే రుద్ర పట్టుకోవాలని ట్రై చేస్తాడు. ప్రీతి పీకపైన కత్తి పెట్టి దగ్గరికి వస్తే చంపేస్తానని ఇంట్లో అందరిని బెదిరిస్తాడు. రుద్ర బావ చెప్పింది నిజమే ఇతను ఆ సూర్యని చంపడానికే వచ్చాడని వీరు అంటాడు. దాంతో రుద్ర వంక శకుంతల కోపంగా చూస్తుంది.

ఆ తర్వాత తనని వదిలిపెట్టమని సైదులుకి రుద్ర వార్నింగ్ ఇస్తాడు. వీరు వెళ్లినట్టు సైదులు దగ్గరికి వెళ్లినట్టు యాక్టింగ్ చేసి చేతికి గాయం చేసుకుంటాడు. సైదులు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఎవరికోసమే వీళ్ళ ప్రాణాలు తీస్తావా అని రుద్రపై శకుంతల కోప్పడుతుంది. ఇప్పుడే అతన్ని ఇక్కడ నుండి పంపించాలని శకుంతల కోప్పడుతుంది. పెద్దసారు కూడా శకుంతలకి సపోర్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.