English | Telugu

ప‌డుకుంటేనే ఆఫ‌ర్స్‌.. జ‌బ‌ర్ద‌స్త్ గీతూ షాకింగ్ కామెంట్స్‌

గ‌లాటా గీతూ అలియాస్ గీతూ రాయ‌ల్.. జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ లో ప్ర‌స్తుతం ఆక‌ట్టుకుంటోంది. ఇటీవ‌లే ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ క్రేజీ లేడీది చిత్తూరు. అందుకే చిత్తూరు యాస‌కు ప్ర‌చారం చేస్తూ ఆ భాష‌లో అద్భుతంగా డైలాగులు చెబుతూ ఆక‌ట్టుకుంటోంది. చూడ్డానికి సినిమాల్లో న‌టిగా క‌నిపించే గీతూ రాయ‌ల్ కు మొద‌ట్లో చాలా సినిమాల్లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. అయితే న‌టిగా కొన‌సాగ‌డానికి తాను సిద్ధంగా లేక‌పోవ‌డంతో త‌నని వెతుక్కుంటూ వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ని గీతూ సున్నితంగా తిర‌స్క‌రించింద‌ట‌.

చిన్న సినిమాల్లో ఆ త‌రువాత మెరిసిన గీతూ ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్ లో త‌న‌దైన యాస‌తో న‌వ్వులు పూయిస్తోంది. అయితే ఓ సంద‌ర్భంలో తాను ఎదుర్కొన్న చేదుఅనుభ‌వాన్ని పంచుకుని మేనేజ‌ర్ ల‌తో ప‌డుకుంటేనే ఆఫ‌ర్లు అంటూ షాకిచ్చింది. ఇటీవ‌ల ఓ యూట్యూబ్ చాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అవ‌కాశం కోసం తాను కూడా ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ సంఘ‌ట‌న గురించి వివరించింది. నాకు ఈవెంట్ ల‌కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌డం అంటే ఇష్ట‌మ‌ని చెప్పిన గీతూ ఓ స‌మ‌యంలో ఆస్ట్రేలియాలో నిర్వ‌హించే ఓ ఈవెంట్ కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం వ‌చ్చింద‌ట‌.

మంచి రెమ్యున‌రేష‌న్ కూడా ఇస్తార‌ని తెలియ‌డంతో వెంట‌నే ఆ ఈవెంట్ కు వెళ్ల‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ట‌. మూడు రోజుల పాటు జ‌రిగే ఈవెంట్ కోసం ఆస్ట్రేలియా వెళ్ల‌డానికి రెడీ అయిపోయిన త‌న‌కు టికెట్ బుక్ చేసే వ్య‌క్తి ఫోన్ చేశార‌ట‌. మీకు ప‌ర్స‌న‌ల్ గా ఓకేనా అని అడిగార‌ట‌.. ఆ మాట‌లు అర్థం కాక ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ ని పెడుతున్నారేమోన‌ని తాను ఓకే చెప్పింద‌ట‌. అయినా స‌రే స‌ద‌రు వ్య‌క్తి మ‌రో సారి మీకు మేనేజ‌ర్ తోఓకేనా అని అడిగాడ‌ట. ఆ మాట‌ల‌తో త‌ను ఏం చెబుతున్నాడో త‌న‌కు అర్థ‌మైంద‌ని, మేనేజ‌ర్ తో ప‌డుకోవ‌డానికి మీకు ఓకేనా అని త‌ను ఇండైరెక్ట్ గా అడ‌గ‌డంతో వెంట‌నే ఫోన్ క‌ట్ చేసి ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంద‌ట గీతూ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.