English | Telugu

ఆది అంత పెద్ద విలనా?

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం కొత్త కొత్తగా అలరిస్తూనే ఉంది. రాబోయే వారం మాత్రం కాస్త స్పెషల్ గా ఉండబోతోందనే విషయం రీసెంట్ గా రిలీజ్ ఐన ప్రోమో చూస్తుంటే అర్థమౌతోంది. ఈ షోలో అప్పు మీద స్కిట్స్ , గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక ఈ ఎపిసోడ్ కి తీస్ మార్ ఖాన్ మూవీ త్వరలో రీలీజ్ అవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ఆ మూవీ హీరో ఆది, హీరోయిన్ పాయల్ రాజపుత్ వచ్చారు. పాయల్ ని చూసేసరికి నాటీ నరేష్ వాట్ ఆ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అంటూ కంప్లిమెంట్ ఇస్తాడు. వెంటనే పాయల్ కూడా నరేష్ ని ముద్దు పెట్టుకుంటుంది. వెంటనే ఆది లైన్ లోకి వచ్చి "సేమ్ అదే ఇచ్చేరా మనకి కూడా" అంటూ పాయల్ ని అడిగేసరికి "యు ఆర్ మై బ్రో" అంటుంది. అంతే ఆదికి ఏం మాట్లాడాలో అర్థంకాక సైలెంటైపోతాడు. ఇక ప్రోమో ఫైనల్ ని చూస్తే గనక మనం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నామా లేదా శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తున్నామా అనే సందేహం కచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ లో ఎలిమినేషన్ రౌండ్ ని ఈ షోలో ప్రవేశపెట్టారు.

ఇందులో రష్మీ, ఆటో రాంప్రసాద్, పూర్ణ, బులెట్ భాస్కర్, ఆది, పంచ్ ప్రసాద్ ఈ ఆరుగురు ఫోటోలు చూపించి ఈ ఫొటోస్ లో మీకు నచ్చని వాళ్ళు ఉంటె ఆ ఫోటోని చింపేయొచ్చు లేదా కాల్చేయొచ్చు అని చెప్తుంది. ఫస్ట్ రాంప్రసాద్ వచ్చి ఆది విషయంలో నేనొకసారి హర్ట్ అయ్యాను అంటూ ఆది ఫోటోని కాల్చి చెత్తబుట్టలో వేసేస్తాడు. తర్వాత పరదేశి వచ్చి ఆది అన్న అంటే అన్నీ ఆయనే అని చెప్తారు కానీ ఒక కారణం వలన ఇలా చేయాల్సి వస్తోంది అంటూ ఫోటోను ముక్కలు ముక్కలుగా చింపి చెత్తబుట్టలో వేస్తాడు. మరో పక్క ఆది బాధపడుతూ ఉన్నట్టు చూపిస్తారు. తర్వాత రష్మీ కూడా ఆది ఫోటోని చింపేస్తుంది. తాను శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిననప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ లో "ఎప్పుడొచ్చావు రష్మీ అని అడగలేదు..ఎప్పుడు వెళ్ళిపోతున్నావ్" అని ఆది అడిగారు.

ఆ విషయంలో బాధపడ్డాను అని చెప్పింది. ఇక తర్వాత ఆదిని పిలిచి మీరు ఏ ఫోటోని కాల్చుతారు అని అడిగేసరికి సీరియస్ గా స్టేజి మీదకు వస్తాడు. ఐతే ఆది ఎవరి ఫోటోని తీసాడో చూపించకుండా ప్రోమో కట్ చేశారు. ఇంతకు ఆది ఎవరిని టార్గెట్ చేసాడు ? పోనీ అందరూ తన మీద వ్యతిరేకత చూపిస్తున్నారని తన ఫోటోని తానే కాల్చుకుంటాడా ? ఏ విషయం తెలియాలంటే 14 వ తేదీన ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ చూడాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.