English | Telugu

న‌రేశ్‌-ప‌విత్ర‌ను కూడా వదల్లేదుగా ఆది!

శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో ఇప్పుడు ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంది అనే విషయం అందరికీ తెలుసు. జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న అందరూ కూడా ఇప్పుడు ఆ షోలో కనిపించడం, ఇక్కడ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్‌ను టీమ్స్ అందిస్తుండేసరికి ఈ షోకి మంచి పేరు వచ్చింది. ఐతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నరేష్-పవిత్ర వ్యవహారంపై వస్తున్న వార్తలు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం.మైసూర్ లో ఒక హోటల్ లో ఉన్న నరేష్, పవిత్ర లోకేష్ గురించి పోలీసులను తీసుకెళ్లి డైరెక్ట్ ఎటాక్ ఇచ్చింది న‌రేశ్ మూడో భార్య ర‌మ్య‌.

ఈ ఎపిసోడ్‌ను ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో వాడేసుకున్నారు. ఈ షో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో అందరూ జోడీలుగా వచ్చారు. నరేష్ క్యారెక్టర్ వచ్చేసరికి, పవిత్ర ముందుకు వచ్చి... నరేష్ కి "నేను ఉన్నాను" అంటుంది. ఇక ఇదే టైంలో ఆది ఎంట్రీ ఇచ్చి పంచ్ వేస్తాడు. "నీ పేరేంటి?" అని ఆది అడిగేసరికి "పవిత్ర" అని ఆన్సర్ ఇస్తుంది. "వాడి పేరు ఏమిటి?" అని అడుగుతాడు ఆది. "నరేష్" అని చెప్తుంది పవిత్ర. ఇంకేముంది అన్నట్టుగా ఆది మొహం పెడతాడు. ఆ డైలాగ్ ఎవరికీ అర్థంకాకుండా పోతుంది. "పవిత్ర, నరేష్" అంటూ పంచ్ ప్రసాద్ క్లారిటీ ఇస్తాడు. దానికి అందరూ పగలబడి నవ్వేస్తారు. మొత్తానికి ఆది.. వాళ్ళను కూడా వదల్లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.