English | Telugu
ఫస్ట్ లవ్ ని గుర్తు చేసుకుని ఏడ్చేసిన హైపర్ ఆది!
Updated : Sep 13, 2022
శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. ఇక ఈ షోలో ఆది పెర్ఫార్మెన్స్ చూస్తే మాటలు రావు. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. సెప్టెంబర్ 18న ప్రసారం అయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో "జోడి నంబర్ 1 " పేరుతో డిజైన్ చేశారు. సుజాత, రాకింగ్ రాకేష్ చేసిన రొమాంటిక్ పెర్ఫామెన్స్ మాములుగా లేదు.
ఇక పంచ్ ప్రసాద్ తన భార్యతో కలసి ఈ షోకి వచ్చాడు. ఈ షోకి హైలైట్ ఏంటి అంటే పంచ్ ప్రసాద్ రియల్ లైఫ్ ని స్కిట్ రూపంలో వేసేసరికి సెట్ లో ఉన్న అందరూ ఎమోషనల్ అయ్యారు. పంచ్ ప్రసాద్ రెండు కిడ్నీలు పాడైపోయినా అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఎంత బాధపడుతుందో ఈ స్కిట్ లో చూపించారు. "ప్రేమించిన వాడికోసం డబ్బు ఖర్చుపెట్టిన అమ్మాయిని చూసా కానీ ఇలా తన జీవితాన్నే ఖర్చు పెట్టిన అమ్మాయిని ఈమెనే చూస్తున్నాను" అన్నాడు ఆది. తర్వాత వాళ్ళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ని ఎత్తుకుని మ్యూజికల్ చేయిర్స్ ఆడాల్సి వస్తుంది. "శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ గేమ్ ప్రతీ ఎపిసోడ్ లో పెట్టాలి." అంటాడు ఆది తర్వాత ఆ గేమ్ లో ఆది అమ్మాయితో సహా కింద పడిపోతాడు.ఈ సమరంలో ప్రాణాలు పోయినా పర్లేదు గేమ్ మాత్రం ఆపొద్దు" అంటాడు మళ్ళీ ఆది.
ఇక తర్వాత ఇంటర్నేషనల్ ఫస్ట్ డే లవ్ సందర్భంగా వాళ్ళ ఫస్ట్ లవ్ నుంచి కొన్ని గిఫ్ట్స్ ని తెప్పించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. అలా హైపర్ ఆదికి కూడా తన ఫస్ట్ లవ్ టైములో రాసిన లవ్ లెటర్ గిఫ్ట్ గా వచ్చేసరికి అది చదువుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు స్టేజి మీద. ఇంతకు ఆ లవ్ లెటర్ లో ఏముంది..ఆది అప్పట్లో ఏం రాసాడు. మిగతా కంటెస్టెంట్ ఫస్ట్ లవ్ గిఫ్ట్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.