English | Telugu

ఆంటీ అంటే ఊరుకోను నరేష్ కి వార్నింగ్ ఇచ్చిన సుమ!

ఇటీవల ఆంటీ అనే పదం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో , ఎంత వివాదాస్పదం అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కాష్ షోలో కూడా ఆంటీ వివాదం కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తోంది. రీసెంట్ గా క్యాష్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో కి జబర్దస్త్ నుంచి దొరబాబు, గడ్డం నవీన్, సన్నీ, వెంకీ, దొరబాబు, బులెట్ భాస్కర్, నరేష్, తేజ వచ్చారు. " షోలో రూల్స్ అన్నీ మీకు తెలుసినవేగా" అని సుమ అనేసరికి "కొత్తవి ఉంటే చెప్పండి మేడం" అన్నాడు నరేష్.

"నువ్వే అంత పాతగా ఉంటే నేనేం కొత్తవి చెప్పను" అంటుంది సుమ. తర్వాత గబ్బర్ సింగ్ మూవీలో పోలీసుస్టేషన్ సీన్ ని ఇక్కడ స్పూఫ్ గా చేసింది సుమ. "అరె గబ్బర్ సింగ్ కె ఫోజియో" అని సుమ అనేసరికి "చెప్పండి ఆంటీ" అన్నాడు నరేష్. "ఎవడ్రా నీకు ఆంటీ.. ఈ జోక్ వేయొద్దని చెప్పానా నీకు.." అని ఫైర్ అయ్యింది సుమ.

తర్వాత సుమ A to Z ఈవెంట్స్ పేరుతో ఫంక్షన్స్ అవీ చేస్తూ ఉంటుంది. అందులో నరేష్ ని కూర్చోపెట్టి లంగా ఓణీ ఫంక్షన్ చేస్తారు అందరూ కలిసి. తర్వాత "సారీ అండి అందరికీ మా ఈవెంట్ వాళ్ళు సీమంతం ఫంక్షన్ ఒప్పుకున్నారు మర్చిపోయి అక్కడ చేయాల్సిన ఫంక్షన్ ఇక్కడ చేసేసారు" అంటూ ట్విస్ట్ ఇచ్చేసరికి ఫూల్స్ అయ్యారు జబర్దస్త్ కంటెస్టెంట్స్. ఫైనల్ గా గడ్డం నవీన్ కి భాస్కర్ కి కళ్ళకు గంతలు కట్టి కర్రలు తీసుకుని బాదేస్తారు అందరూ. ఇలా రాబోయే క్యాష్ షో అలరించబోతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.