English | Telugu

Brahmamudi: రాజ్ దగ్గరికి వెళ్ళిన కావ్య.. ఈసారైనా ధర్మేంద్రకి బిడ్డ దక్కేనా?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmmudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -927 లో... రాహుల్ తో అప్పు అనుమానంగా మాట్లాడుతుంది. నా మొగుడు ఎలా కన్పిస్తున్నాడే అని అప్పుని స్వప్న కోప్పడుతుంది. అది కాదు అక్క అని అప్పు సర్ది చెప్తుంది. మనం ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి.. మీ గొడవ ఏంటని ఇద్దరిపై అరుస్తుంది ఇందిరాదేవి. డాక్టర్ వచ్చి ఏంటి ఈ గొడవ అని అనగానే సారీ డాక్టర్ ని సుభాష్ చెప్తాడు.

మరొకవైపు హోమ్ మినిస్టర్ ధర్మేంద్ర భార్య ప్రెగ్నెంట్ తో ఉంటుంది. డాక్టర్ ఇంటికి చెకప్ చెయ్యడానికి వస్తాడు. బేబీ బాగుందని చెప్తాడు. ఇప్పటికే రెండుసార్లు కడుపులోనే కన్నుముసింది అని ధర్మేంద్ర భయపడుతాడు. ఈ సారి అలా ఏం జరగదు సర్ హాస్పిటల్ మీది.. మీ బిడ్డని రెండు సార్లు కాపాడలేదు అన్న గిల్టీ ఉంది ఈ సారి అలా కాదని మినిస్టర్ కి హామీ ఇస్తాడు డాక్టర్. అదంతా మినిస్టర్ భార్య విని దగ్గరికి వస్తుంది. నాకు ఈసారి భయంగా ఉందని టెన్షన్ పడుతుంటే మినిస్టర్ ధైర్యం చెప్తాడు.

మరొకవైపు నా భర్త నా దగ్గరికి రావాలి.. అప్పుడే ఆపరేషన్ అని కావ్య మొండిగా ఉంటుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి వదిన అన్నయ్య వస్తున్నాడు. మీరు దైర్యంగా ఉండమని చెప్తాడు. దాంతో కావ్య కూల్ అవుతుంది బీపీ నార్మల్ కి వస్తుంది.

ఆ తర్వాత ఎందుకు అక్కతో అలా చెప్పావ్.. బావ వచ్చే సిచువేషన్ లేదు కదా అని అప్పు అనగానే వదినకి అబద్ధం చెప్పానని కళ్యాణ్ అనడం కావ్య వింటుంది.

మరొకవైపు స్టేషన్ కి ఒక రౌడీని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి సెల్ లో వేస్తారు. అప్పుడే కావ్య గురించి రాజ్ ఆలోచిస్తాడు. అ తర్వాత మినిస్టర్ భార్య హాస్పిటల్ లో అడ్మిట్ అవుతుంటే హాస్పిటల్ లో హడావిడి చేస్తారు.

తరువాయి భాగంలో స్టేషన్ లో ఉన్న రాజ్ దగ్గరికి కావ్య వెళ్తుంది. నేను వస్తాను నువు వెళ్లి ఆపరేషన్ చేయించుకోమని కావ్యతో రాజ్ చెప్పి పంపిస్తాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.