English | Telugu

Karthika Deepam 2: జ్యోత్స్నపై మండిపడ్డ శివన్నారాయణ.. తనని కాపాడేది ఎవరంటే?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -564 లో... సుమిత్రకి తనకి ఉన్న వ్యాధి గురించి చెప్పడానికి జ్యోత్స్న ప్రయత్నం చేస్తుంది కానీ సుమిత్ర వినకుండా నిద్రపోతుంది. ఆ మాటలన్నీ సుమిత్ర తప్ప మిగతా వాళ్లంతా విని జ్యోత్స్నకి క్లాస్ తీసుకుంటారు.

అసలు నువ్వు కన్నకూతురివేనా మీ అమ్మకి ఉన్న వ్యాధి తనకే చెప్పాలనుకున్నావ్.. ఒకేసారి చంపాలని చూసావని జ్యోత్స్న పై కాంచన కోప్పడుతుంది. పెంచిన కూతురికి అయినా ప్రేమ ఉంటుంది కానీ నీకు అసలు ఏ ప్రేమ లేదని కాంచన అంటుంది. అప్పుడే దశరథ్ ఎంట్రీ ఇచ్చి జ్యోత్స్నని ఎవరు ఏం అనద్దు తల్లికి బాలేదని తెల్సి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంది. ఇప్పుడెమో ఏకంగా చంపాలని చూసింది.. దైర్యం చెప్పాల్సిన వాళ్లే ఇలా చేస్తే ఎలా ఉంటుంది.. నాకు ఈ ఇంట్లో ఉండాలని లేదు నాన్న.. సుమిత్రని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపోతానని శివన్నారాయణతో దశరథ్ అంటాడు. నువ్వు ఎందుకురా వెళ్లడం అని శివన్నారాయణ అంటాడు.

జ్యోత్స్నకి ఆ సలహా ఇచ్చింది నువ్వేనా అని పారిజాతంపై శివన్నారాయణ కోప్పడతాడు. అది చేసిన తప్పుకి నన్ను అంటున్నారని పారిజాతం కోపంగా జ్యోత్స్న దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత మా అమ్మని కావాలనే చంపాలని చూసింది.. లేదంటే జ్యోత్స్న సొంత కూతురు కాదని తెలుస్తుంది కదా అని కార్తీక్ తో దీప చెప్తుంది.

ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వచ్చి తనని కోప్పడుతుంది. నాకు అన్యాయం జరుగుతుంది గ్రానీ.. అసలు నేనంటే ఎవరికి ఇష్టం లేదు.. ఇదే పని ఆ దీప చేస్తే నిజం చెప్పి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుందని అంటారు. నేను చేస్తే తప్పు, నేరం అంటున్నారు.. ఈ ప్రాబ్లమ్ నుండి బయటపడేసేది ఒక్కరే అని జ్యోత్స్న అంటుంది.

మరొకవైపు శ్రీధర్ ఇంట్లోకి దాస్ వస్తాడు. నా కొడుకు తప్పు చేసాడు బావ.. నేను వాడిని నీకే అప్పగిస్తున్నాను.. నువ్వే వాడిని చూసుకోవాలని కాశీ బాధ్యతలు శ్రీధర్ కి అప్పజెప్పి దాస్ వెళ్ళిపోతాడు. మరొకవైపు కాంచన, శివన్నారాయణ, దశరథ్ ముగ్గురు కలిసి సుమిత్ర దగ్గరికి వస్తారు. సుమిత్ర పరిస్థితి చూసి దశరథ్ ఎమోషనల్ అవుతుంటే కార్తీక్ దైర్యం చెప్తాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.