English | Telugu
బాహుబలి పాటను ఇలా మార్చేశావేంటి నూకరాజు
Updated : Aug 22, 2022
శ్రావణ సందడి ఎపిసోడ్ ని ఆడియన్స్ మస్త్ ఎంజాయ్ చేశారు. ఈ మధ్య కాలంలో హోస్ట్ తో పాటు సైడ్ క్యారెక్టర్స్ గా చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ కూడా జాయిన్ అవుతూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో నూకరాజు కూడా అలాగే కాసేపు ఫన్ చేసాడు. పాట పాడతారా అని నూకరాజుని అడుగుతాడు రవి. పాట పాడతారా ఏమిటి మనలో స్వరాలూ, సంగీత నరాలు కూడా ఉన్నాయి తెలుసా అని అంటాడు. నరాలంటే గుర్తొచ్చింది చిన్నప్పుడు మా మావయ్య అనేవాడు నకరాలు చేస్తే నరాలు తీస్తా అని అంటుంది అనసూయ ...వెంటనే నూకరాజు తీసుకోండి కానీ మాకు ఏదో ఒకటి ఇవ్వండి అంటాడు.
నేను సాంగ్ సింగుతాను అంటూ పెళ్లయ్యాక మగాళ్లు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అదేంటో పాటలో చెప్తాను వినండి అంటాడు. "బలి బలి బలి రా బలి, పెళ్ళైతే మగాడు బలి, సామాన్లు నువ్వే కడగాలి, బట్టలుతకాలి, కాలు నొక్కాలి, మన శాలరీ వాళ్లకు ఇవ్వాలి..ఏసా ..తాళ్హేసా" అంటూ నూకరాజు మంచి ప్యారెడీ పాట పాడి అందరినీ ఎంటర్టైన్ చేసాడు. నూకరాజు జబర్దస్త్ షో ద్వారా చాల త్వరగానే పేరు తెచ్చుకున్నాడు. కామెడీ స్కిట్స్ తో పాటు ఆసియా తో ప్రేమ పురాణం వీడియోలతో కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.