English | Telugu

 శ్రీ‌ముఖిపై హైప‌ర్ ఆది, ఆటో రాంప్ర‌సాద్ ముద్దుల వ‌ర్షం!

శ్రీ‌ముఖి స్టేజ్ ఎక్కితే చేసే ర‌చ్చ మామూలుగా వుండ‌దు. అయితే అలాంటి త‌న‌తో హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్ తోడైతే ఆ హంగామా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందే. `హాలో బ్ర‌ద‌ర్‌` పేరుతో ఓ షోని ఈ ముగ్గురూ క‌లిసి నిర్వ‌హిస‌క్తున్నారు. ఈ షోలో శ్రీ‌ముఖి కోసం హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్ చేసిన ప‌ని నెట్టింట వైర‌ల్ గా మారింది. షోలో హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్ ల‌తో శ్రీ‌ముఖి ఓ గేమ్ ప్లాన్ చేసింది. సాంగ్ ప్లే చేస్తే ఆ పాట‌లో కొన్ని వ‌స్తువుల పేర్లు వ‌స్తాయి.. అవి తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టాల‌ని చెబుతుంది.

దీనికి ఓకే అంటూ త‌లూపిన హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్ `శంక‌ర్ దాదా జిందాబాద్‌`లో ఆక‌లేస్తే అన్నం పెడ‌తా.. అలిసొస్తే ఆయిల్ పెడ‌తా.. మూడొస్తే ముద్దులు పెడ‌తా..` అన‌డంతో వెంట‌నే శ్రీ‌ముఖిపై ముద్దుల వ‌ర్షం కురిపించ‌డానికి శ్రీ‌ముఖి వైపు ప‌రుగెత్తారు.. ఏం జ‌రుగుతోందో తెలిసేలోపే శ్రీ‌ముఖిపై ముద్దుల వ‌ర్షం కురిపించారు హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్. అయితే శ్రీ‌ముఖి బుగ్గ‌ల‌పై కాదు చేతుల‌పై హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్ ముద్దులు పెట్టి షాకిచ్చారు.

హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్ చేసిన పనికి ఆగ్ర‌హంతో ఊగిపోయిన శ్రీ‌ముఖి వాళ్ల‌కి వెంట‌నే బుద్ధి చెప్పాల‌ని అక్క‌డే వున్న హీరో న‌వీన్ చంద్ర‌ను బావా అంటూ గ‌ట్టిగా పిలిచింది. ఆ పిలుపు విని వెంట‌నే స్టేజ్ పైకి వ‌చ్చేసిన న‌వీన్ చంద్ర బుగ్గ‌పై శ్రీ‌ముఖి ముద్దు పెట్టి షాకిచ్చింది. దీంతో న‌వీన్ చంద్ర తో పాటు హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్ కూడా ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. రాఖీ పండుగ సంద‌ర్భంగా ఈటీవీలో `హ‌లో బ్ర‌ద‌ర్` పేరుతో ఓ స్పెష‌ల్ షోని ఏర్పాటు చేశారు. ఇందులో శ్రీ‌ముఖి, హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఈ ఎపిసోడ్ రాఖీ ఫెస్టివ‌ల్ రోజు టెలికాస్ట్ కానుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.