English | Telugu

Guppedantha Manasu : డెడ్ బాడీని గుర్తుపట్టాలంటూ ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళంతా షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -955 లో.. వసుధార, అనుపమ వెళ్తున్న కార్ టైర్ పంచర్ అయ్యేలా చేస్తారు శైలేంద్ర పంపిన రౌడీలు. ఆ తర్వాత కార్ దిగి ఏమైందని వసుధార, అనుపమ ఇద్దరు చూస్తారు.. అంతలోనే కొంతమంది రౌడీలు వాళ్ళని చుట్టముడతారు. వసుధార, అనుపమ ఇద్దరు భయపడతారు. వాళ్ళపై రౌడీలు ఎటాక్ చెయ్యబోతుంటే ఎవరో ఒకతను వచ్చి.. రౌడీలని చితక్కొట్టి వసుధార, అనుపమలని కాపాడతాడు.

అ తర్వాత అతనికి వసుధార, అనుపమ ఇద్దరు థాంక్స్ చెప్తుంటారు. ఏం ఇచ్చి మీ ఋణం తీర్చుకుంటామని అనుపమ అనగానే.. ఒక వంద ఇవ్వండి అని అతను అంటాడు. అప్పుడు అనుపమ అయిదు వందల నోటు ఇవ్వబోతుంటే.. వద్దు వంద చాలు అని తీసుకుంటాడు. ఇప్పుడు ఎలా వెళ్తారు పంచర్ అయింది కదా? నేను మారుస్తానని అతనే టైర్ మరస్తుంటాడు. అసలు మనపై ఎటాక్ ఎవరు చేయించి ఉంటారు. ఇది శైలేంద్ర తప్ప ఎవరు చెయ్యరని అనుపమ, వసుధార ఇద్దరు అనుకుంటారు. కాసేపటికి శైలేంద్రకి వసుధార ఫోన్ చేసి మాట్లాడుతుంది.

మాపై ఎటాక్ చేయించింది నువ్వే కాదా అని వసుధార అడుగగానే.. శైలేంద్ర ఏం తెలియనట్టు మాట్లాడుతుంటాడు. ఎవరు ఎటాక్ చేశారు? ఎంత మంది వచ్చారు? ఎవరు కాపాడరంటూ శైలేంద్ర అడుగుతుంటే.. నువ్వు నా నుండి కూపి లాగడానికి ట్రై చేస్తున్నావా? అసలు నీ గురించి ముకుల్ కి చెప్పి ఆ వీడియో పంపించడం ఎంత సేపు అవ్వదు నాకు. నువ్వు రిషి సర్ ని తీసుకోని రా.. రిషి సర్ పై ఈగ వాలిన నీ సంగతి చెప్తానంటు శైలేంద్రకి వసుధార మాస్ వార్నింగ్ ఇస్తుంది. కాసేపటికి .. అసలు ఈ వసుధార ఎలా తప్పించుకుంది. ఇప్పుడు ఫోన్ ఎవరికి చేసిన ఫోన్ ట్రాప్ లో ఉందని శైలేంద్ర అనుకుంటాడు.

ఆ తర్వాత రిషి ఫోన్ నుండి వసుధారకి ఫోన్ వస్తుంది. రిషి చేస్తన్నాడని వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి చుస్తే.. హాస్పిటల్ బాయ్ ఫోన్ చేసి ఒక ఐడెంటిఫికేషన్ కోసం మీరు హాస్పిటల్ కి రావాలని అంటాడు‌. అలా అతడు అనగానే వసుధార టెన్షన్ పడుతుంది. ఆ విషయం మహేంద్రకి చెప్తుంది వసుధార. ఆ తర్వాత ‌కాసేపటికి మహేంద్ర, వసుధార, అనుపమ హాస్పిటల్ కి వెళ్తారు. అలా వాళ్ళు వెళ్తుంటే వసుధార, అనుపమలని సేవ్ చేసిన అతను కూడా వాళ్ళతో వెళ్తాడు. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్ వచ్చి ఈ ఫోన్ డెడ్ బాడీ దగ్గర దొరికిందని ఫోన్ చూపిస్తాడు.

అ ఫోన్ రిషిది అని వసుధార ఏడుస్తుంటుంది. మీరు అ బాడీ ఎవరిదో గుర్తుపట్టండి అని ఇన్‌స్పెక్టర్ అనగానే వసుధార బయపడుతు చూస్తుంది. చూసిన తర్వాత రిషి సర్ కాదని చెప్తుంది. మహేంద్రణ అనుపమ కూడా చూసి రిషి కాదని చెప్తారు. ఆ ఫోన్ ఆ బాడీ దగ్గర దొరికిందని హాస్పిటల్ బాయ్ చెప్పగానే.. అక్కడకు వెళ్లి చుసిన అతను రిషి కాదని చెప్తారు. మహేంద్ర, వసుధారణ అనుపమని సేవ్ చేసిన అతను.. ఆ బాడీని ఫోటో తీసుకుంటాడు. వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిషి సర్ బాగుంటారని వసుధార అనుకుంటుంది. మరొకవైపు రిషికి చెట్టు మందులతో ఒక ముసలావిడ వైద్యం చేస్తుంటుంది. అప్పుడే ఒక్కసారిగా వసుధర అంటు రిషి కళ్ళు తెరిచి చూస్తాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.