English | Telugu

రెచ్చిపోయిన గౌతమ్.. అక్కా అంటూ యష్మిపై  రివేంజ్‌

బిగ్ బాస్ సీజన్-8 రోజుకో మలుపు తిరుగుతుంది. నాలుగు రోజుల క్రితం ఎపిసోడ్ లో యష్మీ బాగుందంటు గౌతమ్ చెప్పగా.. తనకి పాజిటివ్ గా స్పందించింది. అయితే అలా ఎందుకు చేసిందో గౌతమ్ కి తెలిసింది.ఆ ట్రయాంగిల్ లవ్ నాకు వద్దంటు యష్మీ దగ్గరికి వెళ్ళి చెప్పేశాడు గౌతమ్.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో యష్మీపై విరుచుకుపడ్డాడు గౌతమ్. విష్ణుప్రియ మొదటగా గౌతమ్‌ను నామినేట్ చేసింది. కొన్ని వారాల క్రితం అశ్వత్థామ 2.0 అన్నందుకు గౌతమ్ హర్ట్ అవ్వడం కరెక్ట్‌గా అనిపించలేదు.. అప్పుడు నువ్వు సీరియస్‌గా వెళ్లిపోయావ్.. అది ఒక పాయింట్.. అలానే నువ్వు ఆడవాళ్లకి గౌరవం ఇవ్వాలంటావ్ కానీ లేడీస్ మీదే అరిచావంటూ విష్ణుప్రియ చెప్పింది. ఇక దీనికి డిఫెండ్ చేస్తు యష్మీని మధ్యలోకి లాగాడు గౌతమ్. నేను ప్రేరణతో మాట్లాడుతుంటే యష్మీ ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడిందంటూ గౌతమ్ అన్నాడు. దీంతో హలో గౌతమ్.. నీ అభిప్రాయం నువ్వు చెబితే నా అభిప్రాయం చెప్పాల్సి ఉంటుందంటూ యష్మీ అంది. దీనికి చెప్పు యష్మీ.. చెప్పు ఏమైందంటూ గౌతమ్ అన్నాడు.

యష్మీ ఏదో చెప్తుంటే.. ఆగు అక్కా.. అంటూ గౌతమ్ అన్నాడు. రిపీటెడ్‌గా అలానే అక్కా అంటూ గౌతమ్ అనేసరికి యష్మీ కోప్పడింది. నన్ను అక్కా అనకు.. నువ్వు ఒకసారి క్రష్, ఒకసారి అక్కా అనకు.. అంటూ యష్మీ పిచ్చిగా అరిచేసింది. దీంతో నేను గౌరవం ఇస్తున్నా.. అక్కా అని పిలుస్తా.. అలానే పిలుస్తానంటు గౌతమ్ మరింతగా రెచ్చగొట్టాడు. దీంతో తనకి ఇష్టం లేనప్పుడు పిలవకు అంటూ ప్రేరణ, విష్ణుప్రియ గౌతమ్‌కి చెప్పారు. అయినా సరే నీకు దండం పెడతా ప్రతి ఒక్కటి చెప్పకు అక్కా.. నువ్వు ఏమన్నా లాయరా అంటూ గౌతమ్ రెచ్చిపోయాడు. ఆ తర్వాత విష్ణుతో మాట్లాడుతూ.. నాకు ప్రతి వీక్ ఇదే పాయింట్ చెప్పి నన్ను నామినేట్ చేస్తారా.. ఇక్కడ నా కంటే అన్ బ్యాలెన్స్‌డ్ పర్సన్ లేరా.. నా కంటే కోపం ఉన్నోళ్లు ఉన్నారంటూ గౌతమ్ అన్నాడు.

గేమ్ పరంగా కూడా నువ్వు ఇంకా ఆడాలి.. నువ్వు అబ్బాయిలతో మాట్లాడం నేను చూడలేదు.. ఎప్పుడూ అమ్మాయిలతోనే మాట్లాడతావ్. నువ్వు క్లీనింగ్ అయితే చేయనే లేదు.. నిన్ను నామినేట్ చేయడానికి దగ్గరుండి పాయింట్లు వెతికానంటూ విష్ణు చెప్పేసింది. అంటే నా కంటే ఇక్కడ తక్కువ పని చేసేటోళ్లు.. నా కంటే ఎక్కువ పాయింట్లు ఉన్నోళ్లు నీ చుట్టూ ఉన్నా కూడా నువ్వు నామినేట్ చేయవు.. అదే ఫేవరిజమంటూ ఇండైరెక్ట్‌గా పృథ్వీ టాపిక్ తెచ్చాడు గౌతమ్. నేనేం చేశానో మాత్రమే నువ్వు చూడు.. ఎందుకంటే వచ్చే వారం.. నా పాయింట్లు చెప్తానంటూ గౌతమ్ జైల్లోకి వెళ్లాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.