English | Telugu

అప్పుడు క్రష్ ఇప్పుడు అక్క.. ఇద్దరి మధ్య రివేంజ్ నామినేషన్!

బిగ్ బాస్ సీజన్ -8 లో యష్మీ పాపకి ఉనంత క్రేజ్ మరి ఎవరికి లేదు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా యష్మీ ని నామినేట్ చేసాడు గౌతమ్. మిమ్మల్ని మేడమ్ అనొచ్చా అని గౌతమ్ మొదలెట్టగా.. కాల్ మీ యష్మీ అని తను అంటుంది. నువ్వు ఒక్కో చోట ఒక్కోలాగా మాట్లాడావ్.. ఫ్లిప్ అయ్యావని గౌతమ్ అనగా.. మరి నువ్వు కాదా.. ఒకసారి క్రష్ అంటావ్ మరోసారి అక్క అంటావ్.. నువ్వు ఫ్లిప్ అవ్వడం లేదా అని యష్మీ అంటుంది.

ఆ తర్వాత యష్మీ ని రోహిణి నామినేట్ చేస్తుంది. గంగవ్వ కూడా యష్మీ నే నామినేట్ చేసి.. నువ్వు నీకు నచ్చినట్టు జరిగితే ఒకలా లేదంటే చిరాకుగా ఉంటావని అర్ధం వచ్చేలా గంగవ్వ అంటుంది. నువ్వు ఆ ప్రేరణ కలిసి గౌతమ్ పిలగాడి మీద పడతారు. ఏం అంటుండు ఆ పిలగాడు.. నువ్వు ఒక్కరితోనే ఉంటావని నామినేట్ చేస్తుంది.

ఆ తర్వాత గౌతమ్ ని రివెంజ్ నామినేషన్ చేస్తుంది యష్మీ.. వీకెండ్ లో ఏదో జరిగిందని చెప్పి నా దగ్గరికి వచ్చి అక్క అంటూ మాట్లాడడం నాకు నచ్చలేదు. అక్క అనే ఎమోషనల్ అక్కడ లేదు కాబట్టి నాకు ఇష్టం లేదని యష్మీ అంటుంది. ప్లీజ్ అక్క అనకు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. గౌతమ్ నామినేషన్ అంగీకరించి కలర్ నీళ్ళు పోసుకొని వస్తాడు. నేను అక్క అంటే ఇంత మంది హర్ట్ అవుతున్నారా సారీ అని గౌతమ్ అందరికి చెప్తాడు. గౌతమ్ కి యష్మీ టవల్ ఇస్తూ.. ఇక మన మధ్య ఏం గొడవలు వద్దని చెప్తుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.