English | Telugu
అవినాష్ లో ఆడవేషాలు..శ్రీముఖిలో మగ వేషాలు ఉన్నాయేమిటి?
Updated : Oct 15, 2022
"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ఆడియన్స్ లో జోష్ నింపడానికి వాళ్లకు ఇష్టమైన సీరియల్ యాక్టర్స్ ని తీసుకుని రాబోతోంది. దీనికి సంబంధించి ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో భాగంగా "మల్లి", "గుప్పెడంత మనసు" సీరియల్ టీమ్స్ వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఈ షోకి హోస్ట్స్ గా శ్రీముఖి, అవినాష్ వ్యవహరించారు. అవినాష్ గుప్పెడంత మనసు నుంచి దేవయాని, జగతితో కలిసి డాన్స్ చేసాడు కానీ ఆ సాంగ్ కి కొన్ని మాస్ స్టెప్స్ వెయ్యాలి అవి వెయ్యకపోయేసరికి శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి ఇలా కాదు ఇలా వెయ్యాలి అంటూ స్టెప్స్ చూపించింది. ఇంతలో ఎక్స్ప్రెస్ హరి వచ్చి "అవినాష్ లో ఆడ వేషాలు..శ్రీముఖిలో మగ వేషాలు ఉన్నాయేమిటి ..?" అనేసరికి అందరూ నవ్వేశారు.
ఇక ఆడియన్స్ నుంచి ఒక అమ్మాయి లేచి " రిషి సర్..మీరు వసుధారను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు" అని అడిగింది..దానికి మల్లి కౌంటర్ వేసింది. "నా పేరు మల్లి..చేసుకోండమ్మా పెళ్లి " అనేసరికి స్టేజి మొత్తం నవ్వులే నవ్వులు. తర్వాత జగతి "నరుడా ఓ నరుడా" సాంగ్ కి , రిషి సర్, వసు కలిసి పుష్ప నుంచి "రారా సామి" సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక ఆడియన్స్ నుంచి ఒకామె లేచి "రిషి సర్, వసు ఎప్పుడూ మనసులోనే మాట్లాడుకుంటారు..బయటికి ఎందుకు మాట్లాడుకోరు" అని అడిగేసరికి " గుప్పెడంత మనసు అని సీరియల్ కి పేరు పెట్టినప్పుడు మనసులో మాట్లాడుకోకపోతే ఎలా ఉంటుంది" అని ఆన్సర్ ఇచ్చాడు. దాంతో అందరు చప్పట్లు కొట్టారు. చివరికి సోషల్ మీడియాలో శ్రీముఖి రచ్చ మీద అవినాష్, హరి కలిసి ఒక రేంజ్ లో ఆమెను ఆడేసుకున్నారు. దాంతో అసలు తానెక్కడుందో అర్ధం కాక " నేనెక్కడున్నా" అని అడిగేసరికి " సండే 11 ..ఎంటర్టైన్మెంట్ కి హెవెన్" ఎక్కడున్నావ్ అని ఆన్సర్ ఇచ్చారు.