English | Telugu

Eto Vellipoyindhi Manasu :  నన్ను మోసం చేశాడు.. తనని నా ప్రేమతో మార్చుకుంటాను!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -183 లో.. నందిని దగ్గరకి సీతాకాంత్ వెళ్తాడు. ఇన్ని రోజులకి నన్ను వెతుకుంటూ వచ్చావా అని నందిని ఎక్సయిట్మెంట్ అవుతుంది. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి నా జీవితం లోకి వచ్చావని సీతాకాంత్ అడుగుతాడు. నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను.. నువ్వు మాట తప్పి పెళ్లి చేసుకున్నావ్ కానీ నేను అలా కాదని నందిని అంటుంది. అంటే నువు ఇంకా పెళ్లి చేసుకోలేదా అని సీతాకాంత్ అడుగుతాడు. చేసుకులేదని నందిని అంటుంది. నేను అనుకుని పరిస్థితిలో రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నానని చెప్తాడు. ఇప్పుడు నీ జీవితంలోకి రాలేదు.. ఈ రకంగా అయిన నీకు సాయం చేసే అవకాశం వచ్చింది.. ఇప్పుడు అదంతా ఏం లేదని నందిని అంటుంది.

అ తర్వాత సీతాకాంత్ వెళ్ళిపోయాక నందిని తన గదిలో సీతాకాంత్ తో కలిసి ఉన్న ఫోటోని చూస్తూ.. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఇంతకంటే ఎక్కువ ఎవరు ప్రేమిస్తారు.. అది నీకెందుకు అర్థం కావడం లేదని అని నందిని అంటుంది. అప్పుడే నందిని పిఏ హరిక వచ్చి.. నీతో ఉన్న చనువుతో అడుగుతున్నాను.. నువ్వు చేసేది కరెక్ట్ అంటావ్. సీతాకాంత్ పెళ్లి చేసుకొని తన భార్యతో హ్యాపీగా ఉన్నాడు. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు అతని జీవితంలోకి వచ్చావని అడుగుతుంది.. నేను చేసేది కరెక్ట్ ఎందుకు అంటే సీతా పెళ్లి చేసుకోనని చెప్పాడు కానీ మోసం చేసాడు. మాట తప్పాడు. తన పెళ్లి అనుకోని పరిస్థితిలో జరిగింది అంటున్నాడు కదా.. వాళ్ళు కుటుంబం కోసం చేసుకున్నారు. అది బిజినెస్ అవుతుంది తప్ప అందులో ప్రేమ ఎక్కడ ఉందని నందిని అంటుంది. ఒకవేళ మనసు మారి నాతో ప్రేమలో పాడుతాడేమో.. అందుకే నా ప్రేమతో తనని నా వైపు మార్చుకుంటానని నందిని అంటుంది.

మరోవైపు రామలక్ష్మి తన గదిలో సీతాకాంత్ కోసం ఎదురుచూసి , ఫోన్ ట్రై చేస్తుంది. ఇక పెద్దాయన దగ్గరికి వెళ్లి ఇంకా సీతాకాంత్ రాలేదని చెప్పగా.. టెన్షన్ పడకు, వస్తాడని పెద్దాయన అంటాడు. రామలక్ష్మి తన గదిలో శోభనానికి పూలతో బెడ్ నీట్ గా డెకరేట్ చేస్తుంది. అది చూసిన శ్రీవల్లి షాక్ అయి వెంటనే శ్రీలతని తీసుకొచ్చి చూపిస్తుంది. కాసేపటికి సీతాకాంత్ వస్తాడు. అతను రాగానే రామలక్ష్మి పరుగున వస్తుంది. వచ్చారా? ఫోన్ చేస్తే కలవట్లేదు.. పదండి భోజనం వడ్డిస్తానని రామలక్ష్మి అనగానే.. నాకు కాస్త తలనొప్పిగా ఉందని సీతాకాంత్ అంటాడు. ట్యాబ్లెట్ తీసుకొస్తానని రామలక్ష్మి అనగానే..వద్దని సీతాకాంత్ అంటాడు. మరి గదిలోకి రండి పడుకోండి అని రామలక్ష్మి అనగానే .. కాసేపు ఇక్కడే ఉంటా.. నీకు నిద్రొస్తే పడుకోమని సీతాకాంత్ అనగానే రామలక్ష్మి కోపంగా గదిలోకి వెళ్తుంది. ఇక పూలతో అలకరించిన వాటిని అన్నింటిని తీసి పడేసి.. ఓ‌ చాప తోసుకొని దానిపై పడుకుంటుంది. అదంతా చాటుగా శ్రీలత, శ్రీవల్లి చూసి సంతోషిస్తారు.‌ ఇక మరుసటి రోజు ఉదయం పెద్దాయన సోఫాలో‌ ఉన్న సీతాకాంత్ ని చూస్తాడు. సీతాకాంత్ లేచి గుడ్ మార్నింగ్ అని చెప్పగా.. నీకేమైంది ఇక్కడ పడుకున్నావని పెద్దాయన అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.