English | Telugu

భర్తపై అలిగిన భార్య.. ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -184 లో... హాల్లో పడుకొని ఉన్న సీతాకాంత్ దగ్గరికి పెద్దాయన వచ్చి ఇక్కడ పడుకున్నావ్ ఏంటని అడుగుతాడు. రామలక్ష్మి నీకు ఏదో చెప్తాను అంది కదా అదే విషయం నీకు చెప్పాలని చాలా వెయిట్ చేసింది.. మరి ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వెళ్ళానని సీతాకాంత్ చెప్పగా.. నీ భార్య కంటే ఎక్కువనా అది అని పెద్దాయన కోప్పడతాడు. దాంతో రాత్రి రామలక్ష్మితో మాట్లాడింది గుర్తుచేసుకుంటాడు.

ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్ వెళ్తాడు. నాపై చాలా కోపంగా ఉన్నట్టు ఉందని అనుకుంటాడు. రామలక్ష్మి అని పిలవగానే.. అయ్యో వచ్చారా తలనొప్పి అన్నారు కదా తగ్గిందా అంటు వెటకారంగా మాట్లాడుతుంది. నువ్వు రాత్రి ఒక విషయం చెప్తానన్నావ్ ఏంటని అడుగుతాడు. నేను మర్చిపోయా గుర్తుకువచ్చినప్పుడు చెప్తానని కావాలనే రామలక్ష్మి అంటుంది. నేను అలా వెళ్లినందుకు సారీ అని సీతాకాంత్ చెప్తాడు. అయిన సీతాకాంత్ పై రామలక్ష్మి కోపంగా ఉంటుంది. ఆ తర్వాత పెద్దాయనకి రామలక్ష్మి టిఫిన్ పెడుతుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. అతనికి ప్లేట్ నిండుగా ఇడ్లీ చట్నీ వేస్తుంది. ఏంటి ఇలా చేసావని సీతాకాంత్ అడుగగా.. మీరు బిజీ కదా ఎప్పుడు వెళ్లిపోయేది తెలియదు కదా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. నువ్వు కాళ్ళు పట్టుకుంటావో.. చేతులు పట్టుకెంటావో నాకు తెలియదు.. నువ్వు రామలక్ష్మి అలక తీర్చాలని సీతకాంత్ తో పెద్దాయన అంటాడు.

ఆ తర్వాత సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్తాడు. రామలక్ష్మి ఫోటో చూస్తూ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను.. ఆ విషయం నీతో ఎలా చెప్పాలని సీతాకాంత్ అనుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి కూడా సీతాకాంత్ ఫోటో చూస్తూ మాట్లాడుకుంటుంది. ఇద్దరు ఒకేసారి మాట్లాడాలనుకొని ఒకేసారి ఫోన్ చేస్తారు. ఇద్దరికి ఫోన్ కల్వదు. ఆ తర్వాత నిన్ను బాధపెట్టాను సారీ అంటూ సీతాకాంత్ మెసేజ్ పెడతాడు. అది చూసి తనకి ఇష్టమైనవి వండుకొని తీసుకొని వెళ్తానని రామలక్ష్మి అనుకుటుంది. మరొకవైపు నందిని వస్తుంటే గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పాలని సందీప్ అనుకుంటాడు. కానీ నాకు అదంతా ఇష్టం ఉండదని నందిని అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి నందిని వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.