English | Telugu

తనకి దూరంగా ఉండమని నిఖిల్ కి చెప్పిన అమ్మ.. ఇండివిజువల్ గేమ్ ఆడు!

బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ లో భాగంగా నిఖిల్ వాళ్ళ అమ్మ సురేఖ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తను రాగానే నిఖిల్ ఎమోషనల్ అవుతాడు. నిఖిల్ వాళ్ళ అమ్మ అందరినీ పరిచయం చేసుకుంటుంది. అందరి దగ్గరికి ఆప్యాయతగా వెళ్లి పలకరిస్తుంది.

ఆ తర్వాత నిఖిల్ తో పర్సనల్ గా మాట్లాడుతుంది. హౌస్ మేట్స్ తో ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదని చెప్పింది. నువ్వు జెన్యూన్ గా ఉంటున్నావ్.. గ్రూప్ గేమ్ కాకుండా నీ గురించి మాత్రమే ఆడు 'y' కి దూరం గా ఉండని చెప్పింది. y అంటే యశ్మీ... ఇక 'G' తో ఎక్కువ గొడవ పెట్టుకోకు.. నామినేషన్ దగ్గర అని చెప్పుకొచ్చింది. g అంటే గౌతమ్.. ఇక 'p' తో జాగ్రత్త అని చెప్పింది. అమ్మాయా అబ్బాయా అని నిఖిల్ అడుగగా.. పీ అంటే ప్రేరణ అంటూ ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేసింది. ఇక మనోడికి ఏం అర్ధం అయిందో ఏమో చూడాలి.

ఆ తర్వాత సురేఖకి ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో విన్ అయి హౌస్ మేట్స్ కి మటన్ ఇస్తుంది. దానితో పాటు మైసూర్ నుండి మైసూర్ పాక్ తీసుకొని వస్తుంది. దాంతో హౌస్ మేట్స్ ఖుషి అవుతారు. బిగ్ బాస్ హౌస్ లో వంట చేస్తుంది. సురేఖ ఒక్కొక్క హౌస్ మేట్ గురించి ఒక్క వర్డ్ లో వారి గురించి చెప్పేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.