English | Telugu

Divya Velamuri: పవన్ కళ్యాణ్ టాటూలు పర్మినెంట్‌గా  వేసుకోవద్దు..

బిగ్ బాస్ సీజన్-9 లో కామన్ కేటగిరీలో వచ్చిన కంటెస్టెంట్స్ కి యమక్రేజ్ ఉంది. దానికి కారణం పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, దివ్య వేలమూరి, దమ్ము శ్రీజ, హరిత హరీష్, ప్రియా శెట్టి లాంటి వాళ్లు. వీళ్ళంతా హౌస్ లో ఉన్నన్ని రోజులు తమ సత్తా చాటారు.

పన్నెండో వారం దివ్య ఎలిమినేట్ అయ్యింది. అయితే తన ఎలిమినేషన్ కార‌ణం సుమన్ శెట్టి, సంజన. ఓటింగ్ లో సుమన్ శెట్టి, సంజన లీస్ట్ లో ఉంటే దివ్యని ఎలిమినేట్ చేశారు. ఇది కంప్లీట్ గా అన్ ఫెయిర్.. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక డీమాన్ పవన్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగా పోస్ట్ లు చేస్తోంది దివ్య. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ‌ వీడియోని షేర్ చేసింది దివ్య. ఓ అభిమాని పవన్ కళ్యాణ్ పడాల పేరుని చేతిపై పచ్చబొట్టు (టాటు) వేయించుకున్నాడు. అది చూసి అన్ ఫెయిర్ ఇది.. కరెక్ట్ కాదని దివ్య అంది. బిగ్ బాస్ అనేది ఒక షో.. మరో నాలుగు రోజుల్లో ముగుస్తుంది. టెంపరరీ టాటూస్, మీ సిటీలో ప్రచారం చేసుకోవడం అనేది ప్రాపర్ గా ఉంటుంది కానీ‌ ఇలా పర్మినెంట్ టాటూస్ ని బాడీపై వేయించుకోవడం కరెక్ట్ కాదు.. ఇలా చేసేదేదో మీ కన్నవాళ్ళకోసమో , మీ లైఫ్ పార్టనర్ కోసమో చేస్తే బాగుంటుంది. అంతే కానీ ఒక టీవీ షో లో వచ్చే యాక్టర్ కోసం ఇలా చేయోద్దంటూ ఓ పోస్ట్ లో రాసుకొచ్చింది దివ్య.

దివ్య వేలమూరి హౌస్ లో ఉన్నన్ని రోజులు స్ట్రాటజీలు ప్లే చేస్తూ, స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచింది. అయితే తనకి హౌస్ లో ఎవరు సపోర్ట్ చేయకపోవడం పెద్ద మైనస్ అయింది. భరణిని అన్నయ్య పిలిచి అతనితో ఉండటం కొంతమందికి నచ్చలేదు. వారివల్ల దివ్య గేమ్ కూడా అంతగా ఆడలేకపోయింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.