English | Telugu
Brahmamudi : భార్య గురించి మాజీ ప్రేయసికి గొప్పగా చెప్పిన రాజ్.. పిల్లల కోసం కావ్య మొక్కు!
Updated : Mar 6, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -662 లో.....స్వప్న పాప ఏడుస్తుంటే కావ్య వచ్చి జోలపాట పడి ఊరుకోపెడుతుంది. మరి నువ్వు ఎప్పుడు పిల్లల్ని కంటావని కావ్యని ఇందిరాదేవి అడుగుతుంది. ఆ విషయం మీ మనవడిని అడగండి అని కావ్య అంటుంది. ఎప్పుడు ఆఫీస్ అంటూ ఆలోచిస్తాడు. అలాంటోడికి ఏం చెప్తాము. తన ఆశయానికి అడ్డు చెప్పనని కావ్య అంటుంది.
మరొకవైపు యామిని దగ్గరికి రాజ్ వస్తాడు. అప్పటికే రాజ్ పేరు తన పేరు లవ్ సింబల్ తో డెకరేషన్ చేస్తుంది యామిని. అది చూసి రాజ్ చిరాకుపడతాడు. యామిని వచ్చి తన ప్రేమని జ్ఞాపకాలని గుర్తుచేస్తుంది. ప్రేమ అంటే నా భార్యది అందరి బాధ తన బాధ అనుకుంటుంది. అందరికోసం ఆలోచిస్తుందని కావ్య గురించి రాజ్ గొప్పగా చెప్తాడు. నువ్వు ఏదో బ్లాక్ మెయిల్ చేస్తే నేను ఇక్కడికి రాలేదు.. ఈ చిన్న విషయం కూడా నా భార్యకి తెలియొద్దని వచ్చానని రాజ్ అంటాడు. ఇంకెప్పుడు నా జీవితంలోకి రావొద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. తను ఉందని ఇలా నన్ను వద్దని అంటున్నావ్ కదా తనని లేకుండా చేస్తానని యామిని అంటుంది. మరొకవైపు అప్పు మొదటి శాలరీతో ధాన్యలక్ష్మి, ప్రకాష్ కి బట్టలు తీసుకొని వస్తుంది. అవి ధాన్యాలక్ష్మికి ఇస్తుంటే వద్దు ఇలా చేసి నన్ను నీవైపుకి మార్చుకోవాలని చూస్తున్నావా.. అది కుదరదంటూ ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది. అప్పు మాత్రం కూల్ గా సమాధానం చెప్తుంది. అదంతా అపర్ణ విని ఎక్కడ కోప్పడతావోనని అనుకున్న కూల్ గా సమాధానం చెప్పావని అప్పుతో అపర్ణ అంటుంది.
అప్పుడే ఇందిరాదేవి అపర్ణ దగ్గరికి వచ్చి.. నీకు నీ కోడలు కొడుకు గురించి పట్టదు. వాళ్ళు పిల్లల్ని కనడం నీకు ఇష్టం లేదా.. నీ కొడుకు నువ్వు చెప్పాలి కదా .. వెళ్లి వాడిని ఒప్పిద్దామని ఇందిరదేవి అంటుంది. రాజ్ ఇంటికి రాగానే అందరు రాజ్ ని చుట్టూ ముడతారు. తరువాయి భాగంలో నాకు మొక్కు ఉందని కావ్య అనగానే.. సరే ముందు శ్రీశైలం వెళదాం ఆ తర్వాత మనాలి వెళదామని రాజ్ అంటాడు. మరోవైపు కావ్య ఫోటోని రౌడీకీ ఇచ్చి చంపెయమని యామిని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.