English | Telugu

కొత్త యాంకర్లను తొక్కేస్తున్న సుమ!

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. ఎందుకంటే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని ఈ ఎపిసోడ్ లో నిర్వహించారు. ఇక గెస్ట్ గా బ్రహ్మాజీ వచ్చారు. ఆయన కామెడీ అనుకుంటే ఆయనతో పాటు దీపికా కూడా ఫుల్ కామెడీ చేసింది..సుమ ఫుల్ హాట్ గా ఆన్సర్స్ ఇచ్చింది. ఇక కొన్ని ఇంటరెస్టింగ్ డైలాగ్స్ చూద్దాం. బ్రహ్మాజిని "మీకేం కావాలి"అని సుమా అడిగింది. "నాటు కోడి పులుసు" అన్నాడు. "అయ్యో కోడి పారిపోయిందండి" అని సుమ చెప్పింది. "మరి నార్మల్ కోడి" అని బ్రహ్మాజీ అన్నాడు. "నార్మల్ కోడితోనే పారిపోయింది" అని చెప్పింది సుమ. "మీకేం కావాలో చెప్పండి అది వండిపెడతాం" అంది సుమ. "రాజు గారి కోడి పలావ్" అన్నాడు. "అది ఎంఎల్ఏ గారు తినేశారు" అని చెప్పింది. "పోనీ ఎంఎల్ఏ దోశ" అనేసరికి "అది రాజు గారు తినేశారు" అంటూ డైలాగ్స్ తో ఆడుకుంది సుమ. బ్రహ్మాజీ షాకయ్యేసరికి "సారీ అంకుల్" అంటూ ఆటపట్టించింది. తర్వాత రాపిడ్ క్వశ్చన్స్ - కిల్లర్ కౌంటర్స్ పేరుతో ఒక సెగ్మెంట్ నడిచింది.

"పాపం కొత్త యాంకర్ లు, అప్-కమింగ్ యాంకర్ లు పైకొస్తుంటే మీరు తొక్కేస్తున్నారంట" అని బ్రహ్మాజీ అడిగాడు. "ఓకే నెక్స్ట్ క్వశ్చన్" అని ఆన్సర్ చెప్పకుండా దాటేసింది సుమ. "ఎందుకంటే బాగా కమర్షియల్ ఇపోయారు మీరు" అని అడిగాడు. "మీరు ఈ షోకి ఫ్రీగా వచ్చారా" అని కౌంటర్ వేసింది సుమ. "చాలా వేడిగా కోపంగా ఉన్నారు మీరు కొంచెం నవ్వొచ్చుగా" అనేసరికి సుమ నవ్వింది. "తొందరగా కేక్ చేయండమ్మా బ్రహ్మాజీ గారు పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళాలి" అంటూ మళ్ళీ కామెడీ డైలాగ్ వేసింది. "స్టవ్ లేకపోయినా వేడి పొగలు బుస్సుబుస్సుమని వస్తున్నాయి" అంటూ సుమ మీద కౌంటర్ వేసాడు బ్రహ్మాజీ. "ఫైర్ ఇంజిన్ కావాలి సర్" అంటూ మధ్యలో వచ్చి దీపికా అడిగేసరికి "వేరే లాంగ్వేజ్ కి పంపించేస్తే బెటరేమో" అన్నాడు. వెంటనే మానస్ "వేరే లాంగ్వేజ్ నుంచే ఇక్కడికి వచ్చింది" అని చెప్పాడు. దాంతో బ్రహ్మాజీ అవాక్కయ్యాడు. "మీరు కళ్లద్దాలు తీసేసిన, మీ విగ్గు తీసేసినా నాకిష్టమే" అంటూ దీపికా బ్రహ్మాజీని తెగ పొగిడేసింది. వెంటనే యాదమ్మ రాజు వచ్చి "సర్ ఐ లవ్ యు చెప్పేయండి ఐపోతుంది" అన్నాడు. బ్రహ్మాజీ వెంటనే " ఐ లవ్ యు" అనేశాడు. "ఐ లవ్ యు టూ" అంటూ దీపికా రివర్స్ లో ఆన్సర్ ఇచ్చేసరికి ఇంకో సారి అవాక్కయ్యాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.