English | Telugu
ఓంకార్ తో ఆహా 'డాన్స్ ఐకాన్'.. టాప్ హీరో సినిమాలో ఛాన్స్!
Updated : Jun 22, 2022
ఇటీవల 'తెలుగు ఇండియన్ ఐడల్' సింగింగ్ షోతో ఆకట్టుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఇప్పుడొక భారీ డ్యాన్స్ షోతో అలరించడానికి సిద్ధమవుతోంది. 'డాన్స్ ఐకాన్' పేరుతో ఈ షో అలరించనుంది. తాజాగా ఈ షోని అధికారికంగా ప్రకటించారు.
'డాన్స్ ఐకాన్' షో కోసం ప్రముఖ యాంకర్ ఓంకార్ తో ఆహా చేతులు కలిపింది. ఓంకార్ డిజైన్ చేసిన ఈ షో అనౌన్స్ మెంట్ వేడుక తాజాగా హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, ఓంకార్, తదితరులు పాల్గొన్నారు. ఈ షో ఆడిషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే "danceikon@oakentertainment.com"కు 60 సెకన్ల వీడియో పంపి అప్లై చేసుకోవాలి. 5 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
ఈ షోలో గెలిచిన కంటెస్టెంట్ కి భారీ ప్రైజ్ మనీ ఉంటుంది. అలాగే ఆ గెలిచిన కంటెస్టెంట్ కి డ్యాన్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ కి.. టాలీవుడ్ లో ఒక టాప్ హీరోకి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ దక్కనుంది. ఈ షోలో ఇలాంటి సర్ ప్రైజ్ లు ఎన్నో ఉన్నాయని, అవన్నీ త్వరలో తెలుస్తాయని అల్లు అరవింద్, ఓంకార్ తెలిపారు.