English | Telugu

ఆ ఒక్క సీన్ తో శేఖర్ కథ మారిపోయింది!

శేఖర్ మాస్టర్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. అతని నేటివ్ ప్లేస్ విజయవాడ. ఐతే శేఖర్ మాస్టర్ కి అమ్మాయిల పిచ్చి ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ చేయడం ఎవరైనా అమ్మాయితో డాన్స్ చేస్తే సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రోల్ చేయడం వంటివి చూస్తూనే ఉన్నాం.

ఐతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను అలాంటివాడిని కాదు అంటూ చెప్పుకొచ్చాడు. హైపర్ ఆది స్కిట్ లో శేఖర్ మాస్టర్ ల ఒక రోల్ ఉందని అందులో అమ్మాయిలంటే పిచ్చి అన్నట్టుగా చూపించారు అని ఫీల్ అయ్యాడు. శ్రీముఖి తన బుగ్గ మీద పెట్టిన ముద్దుల విషయం గురించి అడిగేసరికి ఎందుకు తనలా ముద్దులు పెట్టిందో తెలీదని చెప్పాడు. ఆ ఒక్క సీన్ తో మొత్తం తన మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చేశారని చెప్పారు. అమ్మాయిలంటే పిచ్చి అన్నట్టుగా చూపించడం స్టార్ట్ చేశారన్నారు.

శ్రీముఖి సడెన్గా వచ్చి ముద్దులు పెట్టేస్తే నేనేం చేయను అంటూ నవ్వాడు శేఖర్ మాస్టర్. ఢీ షోలో కనిపించే కొన్ని కామెడీ బిట్స్ లో వచ్చే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ని జడ్జి గా ఉన్నప్పుడు కంట్రోల్ చేయలేదనే టాక్ వినిపించింది అని అడిగేసరికి. ఢీ అనేది డాన్స్ షో కాబట్టి అది మాత్రమే చూస్తాను. డాన్స్ కి డబుల్ మీనింగ్ అనేది ఏమీ ఉండదు కదా ఇక కామెడీ స్కిట్స్ లో మసాలా అనేది లేకపోతే కామెడీ పండదు అనుకుంటారు కాబట్టి వాళ్ళు అది చేస్తారు. ఏదైనా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వస్తే ఆఫ్ ది రికార్డు చెప్తాము కానీ ఆన్ స్క్రీన్ చెప్పం అని చెప్పుకొచ్చారు శేఖర్ మాస్టర్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.