English | Telugu
క్యాష్: స్టేజ్ పైనే కమెడియన్ చేత తాళి కట్టించిన సుమ!
Updated : Aug 1, 2022
యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కామెడీ షో `క్యాష్ దొరికి నంత దోచుకో`. వివిధ టీవీ షోలు, సీరియల్ స్టార్స్ తో పాటు సినిమా స్టార్స్ ని ఈ షోకు ఆహ్వానిస్తూ సుమ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఈ షో గత కొంత కాలంగా మంచి రేటింగ్ తో ఆద్యంతం సుమ పంచ్ లతో అలరిస్తూ సాగుతోంది. స్టార్స్ ని ఆహ్వానిస్తూ వారిపై సెటైర్లు వేస్తూ నవ్వులు పూయిస్తున్న ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ షోలోకి ఈ వారం జబర్దస్త్ టీమ్ మెంబర్స్ కెవ్వు కార్తీక్ - భాను, నూకరాజు - అసియా, పరదేశి - షబీనా, ప్రవీణ్ -ఫైమా జోడీగా ఈ షొలో పాల్గొన్నారు.
`పటాస్` టైమ్ లో నూకరాజు - అసియా ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ సీరియస్ గా సాగుతోంది. ఇది `క్యాష్ ` షోలోనూ కనిపించింది. షోలోకి ఎంట్రీ ఇస్తూనే నూకరాజు - అసియా జోడీ షాకిచ్చారు. అసియాని చేతుల్లో ఎత్తుకున్న నూకరాజు గిరి గిరా నడుముచుట్టూ తిప్పేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఏం జరుగుతోందో అర్థం కాక సుమ షాక్ తో చూస్తూ వుండిపోయింది. ఆ తరువాత ఏంటీ ఆ అమ్మాయిని మేకపిల్లని తిప్పినట్టు అలా తిప్పావ్ అంది సుమ.
వెంటనే `నా పెళ్లమే కదా` అనేశాడు నూకరాజు. కట్ చేస్తే .. పీది పిజమైన ప్రేమ అయితే వెలిగించుకో అంటూ హారతి కర్పూరం, అగ్గిపెట్టె నూకరాజు చేతితో పెట్టింది సుమ. వెంటనే నూకరాజు హారతి కర్పూరాన్ని వెలిగించుకున్నాడు. వద్దంటూ అసియా ఎమోషనల్ అయింది. ఆ తరువాత నూకరాజు చేత అసియా మెడలో తాళికట్టించింది సుమ. మా అందరికి సాక్షిగా అసియా మెడలో తాళికట్టు అని అతని చేతికి తాళి ఇవ్వడంతో అసియా మెడలో కట్టడానికి వెళ్లాడు.. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఆగస్టు 6 శనివారం రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానున్న `క్యాష్` షో చూడాల్సిందే.