English | Telugu

క్యాష్ : ‘సుమ’ రాజ్యంలో..శిక్షలు ఏంట‌వి.. ఎలా ఉంటాయ్‌?


పాపుల‌ర్ యాంక‌ర్ సుమ వ్యాఖ్యాత‌గా ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న ప్రోగ్రాం `క్యాష్‌`. ఈ వారం ప్ర‌సాం కాబోయే ఎపిసోడ్ లో `హ‌లో వ‌ర‌ల్డ్` వెబ్ సిరీస్‌ టీమ్ పాల్గొని ర‌చ్చ ర‌చ్చ చేశారు. మ‌హారాణిగా సుమ వేసిన శిక్ష‌లు నవ్వులు పూయిస్తున్నాయి. నిహారిక కొణిదెల ఈ సీరీస్ ని నిర్మించింది. ఇందులోని ప్ర‌ధాన పాత్ర‌ల్లో నిఖిల్‌, నిత్యాశెట్టి, `మై విలేజ్ షో` అనిల్ పాల్గొన్నారు. సుమ‌తో వీరు క‌లిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ నెల 23న ప్ర‌సారం కానున్న ఈ తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు.

ఇది నెట్టింట సంద‌డి చేస్తోంది. నిహారిక ఎంట్రీ ఇవ్వ‌డంతో `నిహారిక నిహారిక‌.. అంటూ సాంగ్ వేశారు.. ఇంత‌లో నా కోసం కూడా ఓ సాంగ్ వుంద‌ని సుమ అన‌డంతో `సుమం ప్ర‌తి సుమం సుమం..` అంటూ ఓ పాటేశారు. వెంట‌నే నిఖిల్ `ముస‌లోళ్ల‌కి వేసే సాంగ్ ల‌న్నీ వేస్తారీవిడ‌కి` అని పంచ్ వేశాడు.. నిత్యాశెట్టి రాగానే త‌న‌పై కూడా అనిల్ పంచ్ వేయ‌డంతో అంతా న‌వ్వేశారు. ఇక నిహారిక‌ని డాక్ట‌ర్ గా కూర్చోబెట్టి అనిల్ ని పేషెంట్ ని చేసింది సుమ‌. ఏంటీ నీ ప్రాబ్ల‌మ్ అని అడిగితే వెంట‌నే నిఖిల్ `నోటి దూల‌`అనేశాడు.

ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టిన నిహారిక `ఏంట‌మ్మా నీ ప్రాబ్లమ్‌` అని మ‌ళ్లీ అడిగింది.. వెంట‌నే అనిల్ గ్యాప్ ప్రాబ్ల‌మ్ అన్నాడు. అయితే ఆల‌స్యం ఎందుకు కొత్త సిలిండ‌ర్ మార్చేయ్ అన‌డంతో అక్క‌డున్న వాళ్లంతా గొళ్లున న‌వ్వేశారు. ఆ త‌రువాత ఆంటీ నిఖిల్ కి ఎవ‌రో ఇష్ట‌మంట అని నిహారిక అన‌డం.. ఊరుకో అమ్మ చిన్న‌పిల్లాడు వాడికి అప్పుడే పెళ్లేంటి? అని సుమ స‌మాధానం చెప్ప‌డం..`అమ్మానేను ఏమీ ఎర‌గ‌ని ప‌సికందున‌మ్మా` అని నిఖిల్ అన‌డం.. వెంట‌నే `నువ్వు ప‌సికందుకు కాదురా క‌సి కందువు` అని నిహారిక పంచ్ వేయ‌డం న‌వ్వులు పూయిస్తోంది. ఇంత‌కీ సుమ రాజ్యంలో వున్న శిక్ష‌లేంటీ? ఎలా వుంటాయ్? అన్న‌ది తెలియాలంటే 23 రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న తాజా ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.