English | Telugu

బిగ్ బాస్ మణికంఠకి క్షమాపణలు చెప్పిన బ్రహ్మముడి కావ్య!

బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపిక రంగరాజు ఒక్కసారిగా వైరల్ అయ్యింది. దానికి కారణం బిగ్ బాస్ నాగ మణికంఠని కించపరిచేలా మట్లాడటమే.. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం.

స్టార్ మాలో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షో వందో ఎపిసోడ్ ప్రోమోలో.. ఈ అమ్మాయి బదులు నేను ఉండి ఉంటే.. మస్త్ కంటెంట్ ఇచ్చేదాన్ని అని నీకు బిగ్ బాస్ 8‌లో ఎవర్ని చూస్తే అనిపించింది అని శ్రీముఖి ప్రశ్న కంప్లీట్ కాకుండా.. నిఖిల్.. నేను ట్రాన్స్‌పరెంట్‌గా ఉండలేనంటూ విగ్ తీసి.. మణికంఠను ఇమిటేట్ చేసి అతని ఎమోషన్‌ని దారుణంగా ట్రోల్ చేసింది బ్రహ్మముడి కావ్య. దాంతో అక్కడి వారంతా పగలబడి నవ్వారు.‌

బిగ్ బాస్ , ఆదివారం విత్ స్టార్ మా పరివారం రెండూ కూడా మా టీవీలోనే వస్తున్నాయి. తమ ప్రొడ్యూస్ చేస్తున్న షోలోని వారిపై తమే ట్రోల్ చేస్తే ఇంకా వేరే వాళ్లు ఎలా ట్రోల్స్ చేస్తారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దాంతో బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపిక తన తప్పేం లేదని పర్సనల్ గా ఓ వీడియోలో చెప్పింది. నేను షోకి వెళ్లినప్పుడు విగ్ తీసి చూపించాను. చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు.. చాలా కామెంట్స్ చేస్తున్నారు. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. నేను బిగ్ బాస్ హౌస్‌లో ఉండి ఉంటే.. ఎవరి ప్లేస్‌లో ఉంటే మంచి కంటెంట్ ఇచ్చేదాన్ని అన్నప్పుడు నాకు మణికంఠ విషయం గుర్తొచ్చింది. అతను విగ్ తీయడం గుర్తొచ్చింది. అప్పుడు నాకు సడెన్‌గా నేను కూడా బిగ్ బాస్ హౌస్‌లో ఉండి ఉంటే.. నేను కూడా ఇదే పని చేసేదాన్ని కదా అని అనిపించింది. ఎందుకంటే నేను కూడా విగ్స్ యూజ్ చేస్తాను కాబట్టి సీరియల్‌లో కానీ.. బయట కానీ.. నాకు లుక్ క్రియేట్ చేయడానికి నాకు అంత జుట్టు లేదు. కాబట్టి విగ్స్ వాడుతున్నాను. కాబట్టి మణికంఠలా నేను కూడా విగ్ తీసేదాన్ని అని నాకు అనిపించింది. అందుకే శ్రీముఖి ఆ క్వచ్చన్ అడిగినప్పుడు అలా నా విగ్ తీసి చూపించాను.అంతేతప్ప.. మణికంఠని ట్రోల్ చేయడం కానీ.. ఎమోషనల్ డ్యామేజ్ చేయడం కానీ.. అతని ఎమోషన్స్‌తో ఆటలాడుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు. నాకు కరోనా తరువాత చాలా జుట్టు ఊడిపోయింది. కాబట్టి నేను విగ్స్ ఉపయోగిస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్‌లో కూడా నా విగ్ గురించి వీడియో పెట్టాను. అంతేతప్ప మణికంఠను ట్రోల్ చేయడానికి కాదు. విగ్ పెట్టుకునే వాళ్లని నేను ఎంకరేజ్ చేస్తున్నా. నేను అలా చేయడం వల్ల ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే నన్ను క్షమించండి అని చెప్పుకొచ్చింది దీపిక.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.