English | Telugu

Brahmamudi : రాహుల్ కోసం కొత్త కంపెనీ పెడుతున్న రాజ్.. సారీ చెప్పిన స్వప్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -887 లో......రాజ్ దగ్గర నుండి స్వప్న ఫోన్ తీసుకుంటుంది. అది తీసుకొని వెళ్లి రాహుల్ కి ఇస్తుంది. ఫోన్ లో కొత్త కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ ఉంటుంది. అది చూసి స్వప్న షాక్ అవుతుంది. మరొకవైపు పెళ్లిరోజు సందర్బంగా అపర్ణ, సుభాష్ కేక్ కట్ చేశారు. అందరు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే స్వప్న వస్తుంది. అందరిని పిలుస్తుంది కానీ ఎవరు వినిపించుకోకపోవడంతో ఫ్లవర్ వాజ్ పడేస్తుంది‌ దాంతో అందరు ఏమైందని స్వప్నని అడుగుతారు.

రాజ్ కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు.. ఎందుకు ఇలా చేస్తున్నాడు.. స్వరాజ్ కంపెనీకి సంబంధం లేకుండా ఇలా కొత్త కంపెనీ పెట్టి ఫండ్స్ మొత్తం దానికి ట్రాన్స్‌ఫర్ చేస్తూ లెక్కలు చూపించడం లేదు.. ఇలా ఎవరిని మోసం చేద్దామని అనుకుంటున్నారని రాజ్, కావ్యని స్వప్న అడుగుతుంది. అందరికి ఫోన్ లో కొత్త కంపెనీకి సంబంధించినది స్వప్న చూపిస్తుంది. ఇందులో చెప్పడానికి ఏముంది ఒకవేళ పాత కంపెనీకి నష్టం వస్తే ఎలా అని ముందు జాగ్రత్త కొద్దీ వాళ్ళు సేఫ్టీ చూసుకుంటున్నారని రుద్రాణి అంటుంది. అప్పుడే రాజ్ ఎంట్రీ ఇస్తాడు. అవును కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను.. కానీ 'R' అంటే రాజ్ కాదు.. రాహుల్ అని రాజ్ అనగానే అందరు షాక్ అవుతారు.

భలే కవర్ చేసావ్ రాజ్ అని రుద్రాణి అంటుంది. మీరు ఆపండి రుద్రాణి గారు.. మా ఆయన చెప్పేది నిజం.. నీ కొడుకు ఇప్పుడు మారడానికి ట్రై చేస్తున్నాడు.. ఒక ఛాన్స్ ఇద్దామని ఇలా చేసామని కావ్య అంటుంది. ఇప్పుడు స్వరాజ్ కంపెనీలో ఎంత పెద్ద పోస్ట్ ఇచ్చిన వీళ్ళ కింద పని చేస్తున్నాననే ఫీలింగ్ లోనే రాహుల్ ఉంటాడు. అందుకే తనకి సొంతంగా కంపెనీ ఉండి అందులో బాధ్యతలు అప్పగిస్తే వాడికే తెలుస్తుందని రాజ్ అనగానే సారీ కావ్య అని స్వప్న అంటుంది. ఆ తర్వాత రాహుల్ వాళ్లకి సారీ చెప్తాడు. తరువాయి భాగంలో రాజ్ నాకు ఇచ్చింది కంపెనీ కాదు పెద్దకత్తిని ఎలా నరికేస్తానో చూడమని రుద్రాణితో రాహుల్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.