English | Telugu

Brahmamudi : పుట్టింట్లో కావ్య.. మహిళా సంఘాలకి రాజ్ ఏం సమాధానం చెప్పనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -852 లో.....కావ్య దగ్గరికి మీడియా వాళ్ళు వెళ్లి రాజ్ గురించి ఇంకా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతారు. దాంతో రాజ్ దృష్టిలో కావ్యని నెగెటివ్ చెయ్యాలని రుద్రాణి ట్రై చేస్తుంది. నువ్వు ఆపు ఇక దీనంతటికి కారణం రాజ్ కదా.... వాడి వాళ్ళే ఈ సిచువేషన్ వచ్చిందని రుద్రాణి పై ఇందిరాదేవి సీరియస్ అవుతుంది.

ఆ తర్వాత రుద్రాణిని చూసి రాహుల్ నవ్వుతాడు. ఇన్ని రోజుల్లో నువ్వు వేసే ప్లాన్ ఏదైనా సక్సెస్ అవుతున్నావా అని వెటకారంగా నవ్వుతాడు. దాంతో రుద్రాణి తనపై కోప్పడుతుంది. ఆ తర్వాత రుద్రాణికి కావ్య ఫోన్ చేసి మీడియా వాళ్లని మీరే పంపించారు కదా అని అడుగుతుంది. నేను ఎందుకు పంపిస్తానని రుద్రాణి అంటుంది. ఇప్పుడు నాకు డౌట్ మాత్రమే ఉంది అది నిజం అయితే మాత్రం మీకు ఉంటుందని కావ్య కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. రుద్రాణి కోపంగా ఇప్పుడు మీడియా వాళ్ళని పంపిస్తే తిప్పి కొట్టి పంపింది. ఇప్పుడు మహిళ సంఘాలని పంపాలని రాహుల్ తో రుద్రాణి చెప్తుంది.

ఆ తర్వాత కావ్యకి రాజ్ ఫోన్ చేసి.. నువ్వు మీడియా వాళ్ళతో చెప్తే నేను బయపడి నా నిర్ణయం మార్చుకుంటానని అనుకున్నావా అసలు లేదని అంటాడు. ఆ తర్వాత కావ్య ఫోటో పట్టుకొని రాజ్ ఎమోషనల్ అవుతాడు. మరుసటి రోజు మహిళా సంఘాలు రాజ్ దగ్గరికి వచ్చి మీ భార్య మీ టార్చర్ భరించలేక వెళ్లిపోయిందట కదా అని అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.