English | Telugu

Brahmamudi : నిజం చెప్పిన  అపర్ణ..  సృహతప్పి పడిపోయిన కావ్య !

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -836 లో.....రాజ్ ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటే అప్పుడే కళ్యాణ్ వస్తాడు. ఎందుకు అన్నయ్య ఎవరికి నిజం చెప్పకుండా నీలో నువ్వే దాచుకొని అందరికి చెడ్డవాడివి అయ్యావని కళ్యాణ్ అంటాడు. రాజ్ తన బాధని కళ్యాణ్ కి చెప్పుకుంటాడు. నువ్వు వదినతో కాకుండా పెద్దమ్మ తో అయినా అసలు విషయం చెప్పమని రాజ్ కి కళ్యాణ్ సలహా ఇస్తాడు.

ఆ తర్వాత అసలు రాజ్ ఎందుకు ఇలా చేస్తున్నాడో వాడి దగ్గరికి వెళ్లి తేల్చుకుంటానని అపర్ణ వెళ్ళబోతుంటే రాజ్ నే ఎదురుగా వస్తాడు. నేను అలా చెయ్యడానికి కారణం ఉంది.. కావ్య బేబీని మోస్తే తన ప్రాణానికి ప్రమాదమని రాజ్ చెప్పగానే అపర్ణ, సుభాష్ ఇద్దరు షాక్ అవుతారు. ఈ విషయం కావ్యకి చేప్తే తట్టుకోలేదని రాజ్ బాధపడుతాడు. ఈ విషయం కావ్యకి చెప్పాలని అపర్ణ అంటుంది.

మరొకవైపు ఎందుకు ఇలా రాజ్ బెహేవ్ చేస్తున్నాడోనని ఇందిరాదేవితో కావ్య చెప్తుంది. అప్పుడే అపర్ణ వచ్చి నువ్వు బేబీని మోస్తే.. నీ ప్రాణానికే ప్రమాదమని కావ్యకి చెప్తుంది. లేదు మీరు అబద్ధం చెప్తున్నారని కావ్య అంటుంది. నేను అబార్షన్ చేయించుకోనని కావ్య అంటూ స్పృహ తప్పుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.