English | Telugu

Brahmamudi : రేవతి‌ ముసుగుపోయింది.. రుద్రాణి ప్లాన్ సక్సెస్!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -823 లో....కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి రొమాంటిక్ గా మాట్లాడుతుంటే.. అప్పుడే ఇందిరాదేవి వస్తుంది. దాంతో రాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మీరు ఇలా సంతోషంగా ఉంటే నాకు సంతోషంగా ఉందని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత కావ్య చిన్నపిల్లల వీడియోస్ చూస్తూ నవ్వుకుంటుంది. అమ్మమ్మ గారు ఈ పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో అని ఇందిరాదేవితో కావ్య అంటుంది.

ఆ తర్వాత కావ్య ఫోన్ కి డాక్టర్ ఫోన్ చేస్తుంది కానీ అప్పు లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. నేను అప్పుని డాక్టర్ చెప్పండి అని అనగానే కావ్య గారు బేబీని మోయ్యాలేరు.. అబార్షన్ కంపల్సరి అని డాక్టర్ అంటుంది. దాంతో అప్పు షాక్ అవుతుంది. ఈ విషయం అక్కకి నేను తర్వాత చెప్తానని డాక్టర్ తో అప్పు అంటుంది. ఎవరు అప్పు ఫోన్ చేసింది అని కావ్య అడుగగా కస్టమర్ కేర్ అని అప్పు అంటుంది.. మరొక వైపు జగదీష్ తో రేవతి ఫోన్ మాట్లాడుతుంది. మా అమ్మ నాన్న బాబుని బాగా చూసుకుంటున్నారని మాట్లాడుతుంటే రుద్రాణి వింటుంది. అమ్మ రేవతి.. ఇలా ప్లాన్ చేసావా నీ సంగతి చెప్తానని రుద్రాణి అనుకుంటుంది.

ఆ తర్వాత రేవతిని ఎలాగైనా బయటపెట్టాలని కావ్య నెక్లెస్ తీసుకొని వెళ్లి రేవతి బ్యాగ్ లో వేస్తుంది. ఆ తర్వాత నేను తీసుకొని వచ్చిన నెక్లెస్ వేసుకోలేదేంటి.. కావ్య వెళ్ళు.. తీసుకొని రా అని అపర్ణ అంటుంది. తరువాయి భాగంలో రుద్రాణి ప్లాన్ చేసి రేవతి తనతో డాన్స్ చేసేలా చేసి ముసుగుపోయేలా చేస్తుంది. అందరు రేవతిని చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.