English | Telugu

Brahmamudi : రేవతి కొడుకుని తీసుకొచ్చిన అపర్ణ.. షాక్ లో ఇందిరాదేవి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -786 లో.....రేవతి కొడుకు స్వరాజ్ ని చూస్తుంది అపర్ణ. నువ్వు ఇక్కడ ఉన్నావ్ ఏంటని బాబని అడుగుతుంది అపర్ణ. మా అమ్మ తప్పిపోయిందని బాబు అనగానే నువ్వు కరెక్ట్ గానే వెళ్తున్నావ్ అన్నమాట అని అపర్ణ అంటుంది. ఇప్పుడు మీ అమ్మ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది. మీ ఇల్లు ఎక్కడో తెలుసా అనీ అపర్ణ అడుగుతుంది. మా అమ్మ తీసుకొని వచ్చింది.. మీరు మా ఇంటికీ తీసుకొని వెళ్ళండి అని బాబు అంటాడు.

నాకెలా తెలుసురా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కనుకుందామని అపర్ణ అంటుంది. అదంతా దూరం నుండి కావ్య, రాజు, రేవతి చూస్తుంటారు. పోలీస్ స్టేషన్ అంటుందని రాజ్, కావ్య ఎంట్రీ ఇస్తారు. ఎవరు ఆ బాబు అని తెలియనట్లు అడుగుతారు. నా ఫ్రెండ్ అని అపర్ణ అంటుంది. వాళ్ళ అమ్మ కన్పించకపోతే పోలీస్ స్టేషన్ కి ఎందుకు.. మన ఇంట్లో అప్పుకి చెప్తే సరిపోతుంది కదా అని రాజ్ అంటాడు. వాళ్ళ అమ్మ కన్పించడం లేదని మీకెలా తెలుసని అపర్ణ అంటుంది.‌ అంటే మీరు మాట్లాడుకుంటుంటే విన్నామని రాజ్, కావ్య కవర్ చేస్తారు. రాజ్ కావ్య ప్లాన్ ప్రకారం బాబుని అపర్ణ తన వెంట తీసుకొని వెళ్తుంది. అదంతా రేవతి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది.

మరొకవైపు రేవతి ఇక్కడే ఉంది.. తన పరిస్థితి ఏం బాగోలేదు.. డబ్బు ఇవ్వడానికి వెళ్తే నాకు వద్దు అమ్మ మనసులో చోటు కావాలని చెప్పిందంటూ సీతారామయ్యతో ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత బాబుని తీసుకొని లోపలికి వస్తుంది అపర్ణ. బాబుని చూసి ఇంట్లో అందరు ఎవరు ఈ బాబు అని అడుగుతారు. తరువాయి భాగంలో స్వరాజ్ కి భోజనం తినిపిస్తుంది అపర్ణ. స్వరాజ్ ఆడుకుంటూ ఇందిరాదేవికి డాష్ ఇస్తాడు. తాతమ్మ అని స్వరాజ్ ఇందిరాదేవిని పిలవగా అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.