English | Telugu

Brahmamudi : రాజ్ ని చూసేసిన రాహుల్, రుద్రాణి.. కావ్య మనసు తెలిసేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -714 లో.... కావ్య తన గదిలోకి వస్తుంటే రాజ్ టవల్ పై ఉంటాడు. మీరు ఇక్కడ ఉన్నారేంటని కావ్య అడుగుతుంది. మా రూమ్ లో వాటర్ రావడం లేదని రాజ్ అంటాడు. నాకొక హెల్ప్ చేస్తారా మా రూమ్ లో నా డ్రెస్ ఉంది తీసుకొని రండీ అని కావ్యకి రాజ్ చెప్తాడు. కావ్య సరే అని వాళ్ళ రూమ్ కి వెళ్లేసరికి అక్కడ యామిని ఉంటుంది. దొంగ దొంగ అంటూ కావ్య కావాలనే అంటుంది. ఏంటి యామిని నువ్వు వస్తావని తెలుసని కావ్య అంటుంది.

నువ్వు ఇంతవరకు రాజ్ తో ఉన్నావా అని యామిని అడుగుతుంది. తన పక్కనే ఉన్నాను.. తన బట్టల కోసం వచ్చానని యామినిని రెచ్చగొట్టేలా కావ్య మాట్లాడుతుంది. ఇక రాజ్ ఉన్నా గదిలోకి కావ్య వెళ్తుంది. బయట నుండి యామిని వింటుందని తెలిసి.. ఏవండీ ఏంటి అండి.. ఈ చిలిపి పనులు మీకు ముద్దు కావాలా అంటూ మాట్లాడుతుంది. అది వింటున్న యామినికి తెగ కోపం వస్తుంది. అప్పుడే రాజ్ స్నానం చేసి కావ్య దగ్గరికి వస్తాడు. యామిని కిటికీ దగ్గర నుండి చూస్తుందని కావ్య కావాలనే చీర సెట్ చేసుకుంటుంది. ఏం చేసావే అంటూ యామిని అనుకుంటుంది. ఆ తర్వాత రాజ్ కి కావ్య డిజైన్స్ చూపిస్తుంది. ఏదో గుర్తువచ్చినట్లు రాజ్ బెహేవ్ చేస్తుంటే.. అప్పుడే యామిని ఎంట్రీ ఇస్తుంది. నువ్వు ఎలా వచ్చావని యామినిని రాజ్ అడుగుతాడు. నువ్వే కదా బావ నాకు మెసేజ్ చేసావని యామిని చూపిస్తుంది. అదేసమయంలో రాజ్ లేనప్పుడు వెయిటర్ చేత రాజ్ ఫోన్ నుండి యామిని మెసేజ్ చెయ్యమని చెప్పింది గుర్తు చేసుకుంటుంది యామిని.

ఆ తర్వాత రాహుల్, రుద్రాణి వెయిటర్ గెటప్ లో రెసాట్ లోకి ఎంట్రీ ఇస్తారు. యామిని, కావ్య మాట్లాడుకోవడం వాళ్లు వింటారు. అలాగే రాజ్ ని కూడా చూస్తారు. ఈ యామిని ఎవరు ఈ ట్రయాంగింల్ అర్ధం అవడం లేదు.. రాజ్ ని రామ్ అంటున్నారని రాహుల్, రుద్రాణి అనుకుంటారు. తరువాయి భాగంలో రాజ్ వేరొకరితో క్లోజ్ గా ఉంటే కావ్య జెలస్ గా ఫీల్ అవుతుంది. మిమ్మల్ని ఆవిడ లవ్ చేస్తుంది.‌ నేను మీతో క్లోజ్ గా ఉన్నానని ప్లేట్ విసిరేసి వెళ్ళిందని రాజ్ పక్కన కూర్చొని ఒక అమ్మాయి రాజ్ కి చెప్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.