English | Telugu

Brahmamudi : పడుతోంది ఓ బ్రహ్మముడి.. కలిపేనా ఆ ఇరువురిని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -542 లో....కనకం కృష్ణమూర్తిలు ఇద్దరు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు. ఆ తర్వాత రాజ్, కావ్య తినిపిస్తారు. అలా ఒక్కొక్కరు వెళ్లి కేక్ తినిపించి ఇద్దరిని విష్ చేస్తారు. మీకు పెళ్లి అయి ఇరవై అయిదు ఏళ్ళు గడిచింది. మాకు పెళ్లి అయి యాభై సంవత్సరాలు అవుతుంది. నా పెద్ద కొడుకు పెళ్లి అయి ముప్పై సంవత్సరాలు అవుతుంది. అబ్బాయి ఒక ఇంట్లో పుడతాడు అమ్మాయి ఒక ఇంట్లో పుడుతుంది ఆ ఇద్దరి కలిసి బ్రతకడం కోసం ఒకటి అయి ఒక దగ్గరుంటారని ఇందిరాదేవి అంటుంది.

రాజ్ కి అర్థం అవ్వాలని.. ఒక మూడవ వ్యక్తి మూలాన మహాలక్ష్మి వైకుంఠం వదిలి అలిగి వెళ్ళింది. భార్యభర్తల మధ్య మూడవ వ్యక్తి వస్తే గొడవలు వస్తాయని, అప్పుడే బీజం పడింది.. భార్యపై భర్తకి నమ్మకం ఉండాలి.. భర్తపై భార్యకి గౌరవం ఉండాలి.. భార్య అలిగి వెళ్ళిపోతే భర్త ఒక మెట్టు దిగి వెళ్లడంలో తప్పేం లేదు యాభై ఏళ్ళు మేమ్ కలిసున్నా.. ముప్పై ఏళ్ళు నా కోడలు కొడుకు కలిసున్నా.. పాతికేళ్ళు కనకం, కృష్ణమూర్తి కలిసున్నా.. వాళ్ళు ఆ బంధం కి ఇచ్చే విలువ ఆ బ్రహ్మముడికి ఇచ్చే గౌరవమని ఇందిరాదేవి చెప్పగానే.. అందరు క్లాప్స్ కొడతారు. ఆ తర్వాత అపర్ణ మాట్లాడుతూ.. నా భర్త క్షమించ రాణి తప్పు చేసిన అత్తింటిని ఎప్పుడు వదలలేదని అపర్ణ కొన్ని మంచి మాటలు చెప్తుంది. ఆ తర్వాత కనకం మాట్లాడుతూ.. నేను ఏ తప్పు చేసిన నా భర్త నన్ను దూరం పెట్టలేదు.. తను బాధ్యత వహించాడని కనకం వివాహ బంధం గురించి గొప్పగా చెప్తుంది. ఆ తర్వాత అందరూ అలా తమ ఒపీనియన్ చెప్తారు. రాజ్ కూడా కావ్య గురించి చెప్తాడు.

ఆ తర్వాత కావ్య తను బాధగా తన భర్త మనసులో చోటు లేనప్పుడు బంధం గురించి నేనెలా చెప్పగలనని అంటుంది. అప్పుడే పంతులు గారు వచ్చి.. దంపత్య వ్రతానికి ఏర్పాట్లు చేసారా అని అంటాడు. ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లు కూర్చొని చేస్తారని కనకం అంటుంది. ఇక్కడ దాంపత్యం బాగోలేదు.. ఇక నేనేం చేస్తానని కావ్య కోపంగా వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ కనకం పక్కకు వచ్చి తన నటన మొదలుపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.