English | Telugu

కోమాలో నుండి లేచి కోడలు ఎక్కడ అని అడిగిన అత్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -513 లో.. ఈ ఇంట్లో నా ఉనికి లేనప్పుడు బలవంతంగా మీ ప్రేమని సాధించలేనప్పుడు.. ఇక మీ భార్యగా నాకు సెలవంటూ కావ్య ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. కావ్య వెళ్తుందంటూ ఇందిరాదేవి బాధపడుతూ సీతారామయ్యకి చెప్తుంది. ఇప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామని సీతారామయ్య అంటాడు. కావ్య గడుపదాటి వెళ్ళిపోతుంది. కావ్య ఇంట్లో నుండి వెళ్లిపోయిన విషయం కళ్యాణ్ తెలుసుకుంటాడు. ఆ తర్వాత కావ్య బాధపడుతూ.. తన పుట్టింటికి వెళ్లి ఇంటి ముందు కూర్చొని బాధపడుతుంది. అప్పుడే కనకం చూసి ఏమైందని అడుగుతుంది. లోపలికి వెళదాం పదా అని కనకం అంటుంది.

మీ అనుమతి తీసుకొని వస్తాను.. నేను చుట్టపు చూపుకి రాలేదు.. అత్తింటి గడప దాటి వచ్చానని.. మీ ఇంట్లో నాకు ఉండడానికి చోటు.. కాస్త అన్నం పెడితే చాలని కనకం కృష్ణమూర్తిలతో కావ్య అనగానే.. నువ్వు అలా అడగాల్సిన అవసరమేంటి? నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని కనకం అంటుంది. ఇది నీ ఇల్లు అమ్మా.. నువు కష్టపడి ఇన్ని రోజులు కుటుంబాన్ని పోషించావని కృష్ణమూర్తి అంటాడు. కావ్యని లోపలికి తీసుకొని వెళ్తారు. మరొకవైపు కావ్య గురించి రాజ్ ని అడగడానికి కళ్యాణ్ ఇంట్లోకి వస్తాడు. అన్నయ్య అంటూ గట్టిగా అరుస్తాడు. అందరూ హాల్లోకి వస్తారు. నువ్వు పైన ఉన్నానని అనుకుంటున్నావు కానీ తల దించుకొని ఉన్నావంటూ కోపంగా మాట్లాడతాడు. వదినని ఎందుకు పంపించావని అడుగుతాడు. అన్ని చెప్పిన వాళ్ళు ఆ విషయం చెప్పలేదా అని రాజ్ అంటాడు. రాజ్ చేసింది తప్పు అని రాజ్ పై కళ్యాణ్ కోప్పడుతుంటే.. కళ్యాణ్ అంటు ఇందిరాదేవి అనగానే మీకు మాట్లాడే అర్హత లేదని కళ్యాణ్ అంటాడు. తల్లిగా నాక్కూడా లేదా అని ధాన్యలక్ష్మి అంటుంది. అసలు నీకు తల్లి అనిపించుకునే అర్హత లేదని కళ్యాణ్ అంటాడు.

అసలు వదిన గురించి నీకు తెలుసు కదా అన్నయ్య అని కళ్యాణ్ అంటాడు. కానీ మనిషిని నిర్లక్ష్యం చేసింది. నువ్వు, నేను ఇన్ని రోజులు కలిసి పెరిగాం.. మా అమ్మని పెద్దమ్మలా కాకుండా తల్లిలా చూసావ్.. ఇప్పుడు తనవల్ల అమ్మ అలా ఉంటే తనపై కోప్పడాల్సింది పోయి నన్ను అంటున్నావా అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో మా అమ్మకి ఇలా అవడానికి కారణం అయిన దాన్ని క్షమించను.. నేను తీసుకొని రాను.. వచ్చిన ఒప్పుకోనని రాజ్ ఇందిరదేవితో రాజ్ అంటాడు. ఆ తర్వాత ఆయన మనసులో స్థానం దొరకలేదు.. అలాంటప్పుడు అక్కడ ఉండి ప్రయోజనమేంటి ఒంటరిగా బ్రతకాలని నిర్ణయం తీసుకున్నానని అప్పుతో కావ్య అంటుంది. అపర్ణ స్పృహలోకి వచ్చి.. కావ్య గురించి అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.