English | Telugu

Brahmamudi : అత్తకి క్యాన్సర్.. అల్లుడు ఆ పని చేయగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -536 లో.. కావ్య అగ్రిమెంట్ తీసుకొని కనకం రావడానికి లేబర్ ఆఫీసర్ గా కావ్య బాస్ దగ్గరికి వెళ్తుంది. కావ్య అగ్రిమెంట్ తీసుకుంటుంది.‌ అప్పుడే అనామిక వచ్చి కనకం పిన్ని.. మర్యాదగా ఆ అగ్రిమెంట్ పేపర్ ఇవ్వు.. లేదంటే సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని వెళ్లి.. నువ్వు మోసం చేసి అగ్రిమెంట్ పేపర్ తీసుకున్నావని పోలీసులకి చెప్తానని అనగానే కనకం అగ్రిమెంట్ పేపర్ ఇస్తుంది. వెళ్లి నీ కూతురిని ఆఫీస్ కి రమ్మని చెప్పు అని అనామిక అంటుంది. నా కూతురు రాదు.. ఎలా రప్పిస్తావో చూపిస్తానని కనకం వెళ్లిపోతుంది.

ఆ తర్వాత కనకం ఇంటికి వెళ్తుంది. అప్పుడే ఎక్కడికి వెళ్ళావని కావ్య అడుగుతుంది. దాంతో కనకం జరిగింది చెప్తుంది. ఎందుకిలా చేసావ్.. తనకి ఎలా బుద్ది చెప్పాలో నాకు తెలుసని కావ్య అంటుంది.ఆ తర్వాత రాజ్ పడుకుంటాడు.‌ కావ్య వచ్చి తనతో మాట్లాడినట్టు నేనేం తప్పు చెయ్యలేదని తనని కావ్య హగ్ చేసుకున్నట్లు ఉహించుకుంటాడు రాజ్. దాంతో రాజ్ హాల్లోకి వెళ్లి పడుకుంటాడు. రాజ్ హాల్లో పడుకోవడం అపర్ణ ఇందిరాదేవిలు చూసి.. ఎందుకు ఇక్కడ పడుకున్నావని అడుగుతారు. కావ్య కారణమని చెప్తే.. వీళ్ళతో నాకు గొడవ అని అనుకొని ఏదో ఒకటి మ్యానేజ్ చేస్తాడు. ఆ తర్వాత అపర్ణ ఇందిరాదేవి లు కలిసి ఎలాగైనా రాజ్, కావ్యలని ఒక్కటి చెయ్యాలనుకుంటారు. ఆ పని కనకం చెయ్యగలదని ఇద్దరు అత్త కోడళ్ళు అనుకుంటారు.

ఆ తర్వాత కనకం గుడికి వెళ్ళి అపర్ణ వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే అపర్ణ ఇందిరాదేవిలు వచ్చి కనకంతో మాట్లాడతారు. కావ్య ఎప్పుడు అల్లుడు గారి గురించే ఆలోచిస్తుందని కనకం అంటుంది. రాజ్ కూడా అంతే అని ఇందిరాదేవి అంటుంది. ఎలాగైనా వాళ్ళని కలపాలనుకుంటారు. తరువాయి భాగంలో కనకంకి క్యాన్సర్ అంట అని రాజ్ కి చెప్తుంది అపర్ణ. దాంతో రాజ్ వెళ్తాడు. మీ చివరి కోరిక ఏంటని కనకాన్ని రాజ్ అడుగగా.. నా ముగ్గురు కూతుళ్లు, అల్లుల్లతో కలిసి నా చివరాకరి పెళ్లి రోజు జరుపుకోవాలని ఉందని కనకం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.