English | Telugu

బిగ్ బాస్ హౌస్ లో నబీల్...25 రోజుల్లో లక్షన్నర మంది ఫాలోవర్స్!


బిగ్ బాస్ హౌస్ లో నబీల్ ఓ కొత్త మార్పుని తీసుకొచ్చాడు. నిన్న మొన్నటి దాకా అసలెందుకు చూడాలి అనిపించిన ఈ సీజన్.. సోనియాని నబీల్ నామినేషన్ చేసిన తీరుతో చూడాలనే ఇంట్రెస్టింగ్ కలిగింది.

హౌస్ లో ట్రయాంగిల్ రిలేషన్ షిప్ జరుగుతుంది. అది ఎవరని బిగ్ బాస్ చూసే ప్రతీ ఒక్కరికి తెలుస్తుంది. ఇక వీరిని స్ట్రాంగ్ గా అపోజ్ చేసిన వ్యక్తులలో నబీల్ టాప్ లో ఉన్నాడు. సందు దొరికినప్పుడల్లా వాయించేస్తున్నాడు. నబీల్‌ కాకుండా హౌస్‌లో ఉన్న మిగిలిన మేల్ కంటెస్టెంట్లు అందరూ అమ్మాయిల వెనకాల హగ్గుల కోసం తిరుగడమే సరిపోయింది. నిఖిల్ టాస్కులు బాగా ఆడుతున్నప్పటికీ అస్తమానం సోనియా వెనకాల తిరగడం, సపోర్ట్ చేయడం ఆడియన్స్‌కి అస్సలు నచ్చడం లేదు. అలానే మిగిలిన వాళ్లు కూడా సందు దొరికితే చాలు అమ్మాయిలన ఓదార్చడమే సరిపోతుంది. కానీ నబీల్, ఆదిత్య మాత్రం వీటికి దూరంగా ఉంటున్నారు. ఇక నబీల్ తన ఆటతీరు, మాట తీరుతో ఆడియన్స్‌ మనసులు గెలుచుకుంటున్నాడు. అందుకే ఈ వారం ఓటింగ్‌లో కూడా స్టార్స్‌ను తలదన్ని దూసుకుపోతున్నాడు నబీల్.

తొలిరోజు ఓటింగ్‌లోనే నబీల్ రికార్డులు కొట్టేశాడు. మరి ఇదే ఆటతీరు కొనసాగిస్తే టాప్ లో ఉంటాడనేది వాస్తవం. బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టేముందు నబీల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో 4 లక్షల 50 వేల మంది ఫాలోవర్లు ఉండేవారు. కానీ మూడు వారాలు గడిచాయో లేదో ఇప్పుడు నబీల్ ఖాతాలో దాదాపు 6 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంటే 25 రోజుల్లోనే లక్షన్నర మంది ఫాలోవర్లు పెరిగారు. నిజానికి హౌస్‌లోకి వెళ్లిన 14 మందిలో ఈ రేంజ్‌లో ఫాలోవర్లు పెరిగింది ఒక్క నబీల్‌కి మాత్రమే. అసలు నబీల్‌కి పెరిగిన ఫాలోవర్లలో సగం మంది కూడా ఏ కంటెస్టెంట్‌ సంపాదించలేకపోయారు. ఇక నబీల్ టాస్క్ లో తన వంద శాతం ఎఫర్ట్స్ ఇస్తూ అందరికి బిగ్ బాస్ చూడాలనిపించేలా చేస్తున్నాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.