English | Telugu

Suman Shetty: సుమన్ శెట్టి ప్రభంజనం.. కళ్యాణ్ కి షాకిచ్చిన రెబల్స్!

బిగ్ బాస్ సీజన్-9 లో తొమ్మిదో వారం ఆటస్వభావమే మారిపోయింది. కథలో ట్విస్ట్ లు అన్నట్టు.. హౌస్ లో సీక్రెట్ టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి, దివ్య రెబల్స్ గా ఉండి తమ ఆటతీరుని కనబరిచారు. అద్భుతంగా ఆడి బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో గెలిచారు.

హౌస్ మేట్స్ మూడు టీమ్ లుగా విభజించాడు బిగ్ బాస్. తనూజ, ఇమ్మూ, గౌరవ్, రాము.. ఆరెంజ్ టీమ్, రీతూ, భరణి, నిఖిల్, డీమాన్..బ్లూ టీమ్, దివ్య, కళ్యాణ్, సాయి, సుమన్ శెట్టిలని పింక్ టీమ్ సభ్యులుగా విభిజించాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ అందరికి కాల్స్ వచ్చాయి. అయితే సుమన్ శెట్టి మొదటి రెబల్ అన్నాడు బిగ్ బాస్. ఆ తర్వాత దివ్యకి ఫోన్ వచ్చింది. రెబల్ సుమన్.. రెండవ రెబల్ కూడా ఉన్నారు అది మీరే.. సుమన్ దగ్గర రెబల్‌గా తను చేయాల్సిన సీక్రెట్ టాస్క్‌కి సంబంధించిన చిట్టి ఉంది.. ఆ టాస్క్ ఏంటంటే ఎవరైనా ముగ్గురు సభ్యులని వాళ్లు కూర్చున్న స్థానంలో నుంచి లేపి మీరు ఆ స్థానంలో కూర్చోవాలి.. ఎక్కువ టాస్కులు విజయవంతంగా పూర్తి చేస్తే మీ ఇద్దరికీ కంటెండర్ అయ్యే ఛాన్స్ లభిస్తుందని బిగ్‌బాస్ చెప్పాడు.

టాస్కు ప్రకారం ఏం చేయాలంటే హౌస్‌లో ఎవరైనా ముగ్గురినీ వాళ్లు కూర్చున్న ప్లేస్ నుంచి లేచేలా చేసి ఆ ప్లేస్‌లో వీళ్లు కూర్చోవాలి. ఈ టాస్కుని చాలా సింపుల్‌గా చేసేసింది దివ్య. భరణి, కళ్యాణ్, గౌరవ్, రీతూల మీద ఈ టాస్క్ కంప్లీట్ చేసింది. దీంతో టాస్క్ పూర్తి అయింది. ఇక తర్వాత నలుగురిలో కళ్యాణ్‌ని తీసేద్దామని దివ్య సుమన్‌కి సలహా ఇచ్చింది. ఎందుకంటే మిగిలిన దాంట్లో ఎవరిని తీసినా అందరికి డౌట్ వస్తుందని దివ్య చెప్పింది. దీంతో సైలెంట్‌గా కెమెరా దగ్గరికెళ్లి కళ్యాణ్‌ని తప్పిస్తున్నట్లుగా రెబల్స్ దివ్య-సుమన్ చెప్పేశారు. ఇక కాసేపటికి బిగ్‌బాస్ ఫోన్ చేసి ఇదే కళ్యాణ్‌.‌‌. మిమ్మల్ని రెబల్స్ తొలగించారు. మీ టీషర్ట్ స్టోర్ రూమ్ లో పెట్టమని, ఇదే విషయం అందరికి చెప్పమన్నాడు. ఈ విదంగా సుమన్ శెట్టి, దివ్య కలిసి టాస్క్ పూర్తి చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.