English | Telugu

Biggboss 8 Prerana : నా కోపాన్ని, పిచ్చి మాటలని యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్ కి థాంక్స్

బిగ్‌బాస్ సీజన్-8 గ్రాండ్ ఫినాలేలో టాప్-5 ఫ్యామిలీస్ వచ్చారు. ఇక హౌస్ నుండి ఎలిమినేషన్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వచ్చారు. హరితేజ, నయని పావని మాత్రం మిస్ అయ్యారు. శ్రీకృష్ణ, గీతా మాధురి కలిసి పాటలతో అలరించగా.. నబా నటేష్ డ్యాన్స్ పర్ఫామెన్స్ అదిరిపోయింది. ముందుగా టాప్-5 నుంచి అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు.

ఆ తర్వాత హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చింది. ఇక హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌కి హోస్ట్ నాగార్జున ఓ బాధ్యత అప్పగించారు. హౌస్ లోపలికి వెళ్లి టాప్-4 నుంచి ఒకరిని బయటికి తీసుకురావాలన్నారు. ఇక ప్రగ్యా జైస్వాల్ వెళ్లి నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణలో ఓటింగ్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ప్రేరణని బయటికి తీసుకొచ్చింది. ఇక బయటికి వచ్చే ముందు ప్రేరణ మిగిలిన ముగ్గురికీ ఆల్ ది బెస్ట్ చెప్పి బయటికొచ్చేసింది. ఇక స్టేజ్ మీదకి వచ్చాక ప్రేరణపై ప్రశంసలు కురపించారు నాగార్జున. చాలా కష్టపడి టాప్-5లో నిలిచిన ఒకే ఒక్క లేడీ నువ్వు అంటూ కొనియాడారు. ఇక తనని ఈ స్థాయి వరకూ తీసుకొచ్చిన ప్రేక్షకులకి ప్రేరణ కృతజ్ఞతలు చెప్పింది. తన కోపాన్ని, పిచ్చి మాటలని యాక్సెప్ట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్పింది.

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాకముందు హౌస్ లో ఉన్న లేడి కంటెస్టెంట్స్ లో ప్రేరణకి ఎక్కువ సపోర్ట్ ఉండేది‌. తన ఆటతీరు కూడా బాగుండేది. అయితే ఒకానొక దశలో మెగా ఛీఫ్ కోసం ప్రేరణ పడే కష్టం చూసి అందరు తనని మెగా ఛీఫ్ గా చూడాలనుకున్నారు. కానీ అదే కొంపముంచింది. మెగా ఛీఫ్ తర్వాత ప్రేరణలో చాలా మార్పు వచ్చింది. బ్యాడ్ మెగా ఛీఫ్ అంటూ మెజారిటీ హౌస్ మేట్స్ చెప్పడంతో తనకి నెగెటివిటి పెరిగింది. ఆ తర్వాత ఇండివిడ్యువల్ గా ఆడటానికి ట్రై చేయటంతో టాప్-5 లో నిలిచింది ప్రేరణ.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.