English | Telugu

Bigg boss 9 Telugu : ఒక్క గుడ్డు తెచ్చిన తంటా..సంజన యాక్టింగ్ మాములుగా లేదుగా!


బిగ్ బాస్ సీజన్-9 మొదటి వారం నామినేషన్ ప్రక్రియ పూర్తి అయింది. నామినేషన్ అనంతరం హౌస్ మొత్తాన్ని అతలాకుతలం చేసిన ఏకైక కంటెస్టెంట్ సంజన. ఇన్ని సీజన్ లో ఇలాంటి కంటెస్టెంట్స్ ని ఎవరు చూసి ఉండరనేంతగా తన యాక్టింగ్ పర్ఫామెన్స్ ఉంది. ఓనర్స్ ని అడగకుండా రెంటర్స్ ఎవరు ఏది తీసుకోకూడదు.. అలాగే వాళ్ళ పర్మిషన్ లేకుండా కనీసం ఇంట్లోకి వెళ్లొద్దు.. ఇలా కొన్ని బిగ్ బాస్ రూల్స్ ఉన్నాయి.. కానీ సంజన రూల్స్ బ్రేక్ చేసింది.

ఫస్ట్ ఓనర్స్ ని సంజన కప్ కాఫీ అడిగింది. వాళ్ళు ఇవ్వమని చెప్పారు.. ఇలా ఇస్తే అందరు అడుగుతారు ఇవ్వమని మనీష్, ప్రియ అంటారు. ఆ తర్వాత ప్రియ గుడ్లు లెక్కపెడుతుంది. అందులో ఒకటి మిస్ అవుతుంది. ఎవరు తిన్నారని రెంటర్స్ ని ప్రియ అడుగుతుంది. ఎవరిని అడిగినా మేమ్ తినలేదని అంటారు. నేను తిన్నానని రాముతో సంజన చెప్తుంది. కాసేపు చూసి నేను తినలేదని చెప్తానని రీతూతో సంజన అంటుంది. అసలు మిమ్మల్ని హౌస్ లోకి రమ్మని చెప్పడం తప్పైందని మనీష్, ప్రియా రెంటర్స్ పై కోప్పడుతారు. నీ ఒక్కదాని వల్ల మాకు అందరికి శిక్ష అని భరణితో పాటు మిగతా వాళ్ళు సంజనపై అరుస్తారు. సంజన మాత్రం ఏం పట్టనట్టు కూల్ గా కూర్చొని ఉంటుంది.

తనే తింది అని ఓనర్స్ తో చెప్తాడు రాము. నువ్వు తినడం ఎవరు చూసారని ప్రియ వాళ్ళు సంజనని అడుగగా.. తనూజ, భరణి, శ్రష్టి చూసారని సంజన చెప్తుంది. అంటే ఇప్పటివరకు అడిగాం.. ఎవరు తిన్నారని ఎవరు చెప్పాలేదని రెంటర్స్ పై ఓనర్స్ కోప్పడతారు. మధ్యలో ఈ టాపిక్ గురించి హరీష్, భరణికి మధ్య పెద్ద గొడవ అవుతుంది. ఆ తర్వాత సంజనపై రీతూ చౌదరి కోప్పడుతుంది. చివరికి సంజన ఏడుస్తూ అందరి నోళ్లు మూతపడేలా చేసింది. ఇలా సంజన తన నటన అనుభవాన్ని ఇక్కడ చూపిస్తూ కంటెస్టెంట్స్ అందరికి చుక్కలు చూపించింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.