English | Telugu

Bigg boss 9 Telugu : బిగ్ బాస్ మాట. రీతూ గాసిప్ వేట!

బిగ్ బాస్ సీజన్-9 లో మూడో వారం నామినేషన్లు ఫుల్ హీటెక్కించాయి. నిన్నటి ఎపిసోడ్ లో పవన్ తనని సేవ్ చెయ్యలేదని రీతూ ఏడుస్తుంది. మరొకవైపు తనని నామినేట్ చేసారని శ్రీజ ఏడుస్తుంది కానీ పవన్ తన పవర్ తో శ్రీజని నామినేషన్ నుండి సేవ్ చేస్తాడు. ఇక బిగ్ బాస్ రీతూ(Rithu Chowdary)ని కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు. తన ముందు చికెన్ పెట్టి ఇంట్లో జరుగుతున్న రహస్యం గురించి చెప్పమంటాడు.

తనూజకి పవన్ అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. తనతో ఉన్నంతవరకు హ్యాపీగా ఉంటుందని రీతూ చెప్తుంది. ఇంకా పవన్ గురించి చెప్పమని బిగ్ బాస్ అడుగగా.. అతను ఒకమ్మాయిని లవ్ చేసాడట కానీ తనకి చెప్పలేదట. ఈ హౌస్ లో నేను అంటే ఇష్టం అన్నాడు ఫ్రెండ్ గా అని రీతూ చెప్పగానే నువ్వు ఏం సరిగ్గా చెప్పట్లేదని బిగ్ బాస్ అంటాడు. నాకు ఈవెనింగ్ వరకు టైం ఇవ్వండి బిగ్ బాస్ ఆ లోపు అందరి దగ్గరికి వెళ్లి తెలుసుకొని మీకు చెప్తాను. చికెన్ అప్పుడే ఇవ్వండి అని రీతూ అనగానే బిగ్ బాస్ సరే అంటాడు. ఇక రీతూ అదేపనిగా అందరి దగ్గరికి వెళ్లి వాళ్ళ నుండి ఎంతో కొంత గాసిప్ తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది.

ఆ తర్వాత డీమాన్ పవన్ దగ్గరికి వచ్చి నీకు హౌస్ లో ఎవరంటే ఇష్టమని అడుగుతుంది. ఇండైరెక్ట్ గా తన పేరే చెప్తాడు డీమాన్ పవన్. ఇక కాసేపటికి సంజన దగ్గరికి వెళ్ళి రీతూ మాట్లాడుతుంది. ఎందుకు డీమాన్ పవన్ శ్రీజతో ఉంటున్నాడని రీతూని సంజన అడుగుతుంది. నిన్ను సేవ్ చెయ్యకుండా తనని సేవ్ చేసాడు.. నేను అదే అడిగాను.. మీ పేర్ చూడడానికి క్యూట్ గా ఉంటుంది. బాగా వెళ్తదని సంజన అంటుంది. ఇక రీతూకి ఒక హింట్ వచ్చేసింది.. ఇక తన పర్ ఫామెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.