English | Telugu

ప్రియాంక సింగ్ ఇంట్లో విషాదం..


బుల్లితెర మీద కనిపిస్తూ నవ్వించే ప్రియాంక సింగ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రియాంక తండ్రి బీబీ సింగ్‌ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రియాంక సింగ్‌ ప్రకటించింది. తన తండ్రితో తీసుకున్న ఓ వీడియోన పోస్ట్ చేసి "మిస్ యూ డాడీ" అని కాప్షన్ పెట్టి తన తండ్రి అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పుకొచ్చింది. దీంతో ఆమె ఫాలోవర్స్, ఫ్రెండ్స్ అంతా బిబి సింగ్ కు నివాళి అర్పించి ప్రియాంక సింగ్ కి ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈమె బిగ్ బాస్ 5 లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించింది.

బిగ్ బాస్ వేదికగా తానూ అబ్బయినైనా కానీ అమ్మాయిగా మారిపోయానని ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ చేయించుకున్న విషయాన్ని తండ్రికి చెప్పింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక సింగ్ నిర్ణయాన్ని ఆమె తండ్రి తో పాటు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. దాంతో తన తండ్రికి ఒక ఇల్లు కూడా కట్టించి ఇచ్చింది. ఐతే ప్రియాంక సింగ్ కి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక పెద్దగా ఆఫర్స్ ఏమీ రాలేదు. ఫోటో షూట్స్, ప్రమోషనల్ వీడియోస్ చేస్తూ ఉంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.