English | Telugu

Bigg boss 9 Telugu: సుమన్ శెట్టి కోసం ఆ బాక్స్ ని రివీల్ చేసిన భరణి.. అందులో ఏం ఉందంటే!

బిగ్ బాస్ సీజన్-9 మొదలై అప్పుడే మూడో వారానికి వచ్చేసింది. హౌస్ లో ఫ్యామిలీ నుండి వచ్చిన సర్ ప్రైజెస్ ని కంటెస్టెంట్స్ కి అందిస్తున్నాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో ఇమ్మాన్యుయల్ ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాడు. ఇక తనూజ వంతు రాగా తను వాళ్ళ అమ్మ దగ్గర నుండి లెటర్ తీసుకుంటుంది. బ్యాటరీ బోర్డులో పది శాతం మాత్రమే ఉంటుంది సుమన్ శెట్టికి అవకాశం వస్తుంది. సుమన్ కన్ఫెషన్ రూమ్ కి వెళ్తాడు.

ఆ తర్వాత నీకు బ్యాటరీ శాతం పెరగాలంటే భరణి దగ్గరున్న గిఫ్ట్ బాక్స్ రీవీల్ చెయ్యాడానికి అతన్ని కన్విన్స్ చెయ్యాలి. అప్పుడు బ్యాటరీ శాతం పెరుగుతుంది. నీకు మూడు ఆప్షన్స్.. ఫ్యామిలీ ఫోటో, లెటర్, మీ వైఫ్ నుండి వాయిస్ మెసేజ్ అని బిగ్ బాస్ చెప్తాడు. భరణి దగ్గరికి సుమన్ వెళ్లి విషయం చెప్తాడు. దాంతో భరణి ఒకే అంటాడు. మంచి సందర్బం చూసుకొని అందరి ముందు రివీల్ చెయ్యాలనుకున్నాను కానీ సుమన్ కి యూజ్ అవుతుంది అంటే హ్యాపీగా ఓపెన్ చేస్తానని బాక్స్ ఓపెన్ చేస్తాడు.

అందులో చైన్, ఒక లాకెట్ ఉంటుంది. లాకెట్ కి ఒక సైడ్ మా అమ్మ.. ఇంకొరు మా గురువు.‌ మీరు అంటున్నారు కదా నేను సైలెంట్ గా ఉంటున్నానని వాళ్లకు మాటిచ్చాను కాబట్టి సైలెంట్ గా ఉంటున్నానని భరణి చెప్తాడు. బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ రోజు ఆ బాక్స్ హౌస్ లోకి తీసుకొని వెళ్ళడానికి భరణికి బిగ్ బాస్ పర్మిషన్ ఇవ్వలేదు. అలా అయితే నేను హౌస్ లోకి వెళ్లనని భరణి చెప్తాడు. కాసేపటికి బిగ్ బాస్ ఒకే చెప్తాడు. కానీ ఇప్పుడు సుమన్ వల్ల రీవీల్ చేసాడు భరణి. సుమన్ శెట్టికి వాళ్ళ నాన్న ఫోటో వస్తుంది. మళ్ళీ బ్యాటరీ పది శాతం అవుతుంది. ఇంతటితో ఈ ప్రక్రియ పూర్తి అయిందని బిగ్ బాస్ చెప్పగానే సంజన బాధపడుతుంది. ఇంకా హౌస్ లో ఎవరెవరికి సర్ ప్రైజెస్ వస్తాయో చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.