English | Telugu

Bigg boss 9 Telugu : బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్.. కంటెస్టెంట్స్ కి మైండ్ బ్లాంక్!

బిగ్ బాస్ సీజన్-9 మూడో వారం బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ అయిన అనూష రత్నం, షకీబ్, నాగ ప్రశాంత్, దివ్య నిఖిత నలుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ వాళ్లలో ఒక్కరే హౌస్ లో పర్మినెంట్ గా ఉంటారు. నలుగురు లోపల ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతారు. తమని హౌస్ లో కి వచ్చేందుకు సపోర్ట్ చెయ్యమని ఓటు అప్పీల్ చేసుకుంటారు.

నలుగురు కూడా ఓటు అప్పీల్ చేసుకుంటారు. హౌస్ లో ఏది మిస్ అయిందో అది మేమ్ ఫుల్ ఫీల్ చేస్తామని మాటిస్తారు. ఓటు అప్పీల్ తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిని ఒక్కొక్కరిగా వచ్చి తమ ఫేవరెట్ పర్సన్ ఎవరైతే హౌస్ లోకి రావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఓటు చెయ్యాలని బిగ్ బాస్ చెప్తాడు. దాంతో అందరూ ఓటు వేస్తారు. తాము ఎవరికీ వేశారు అనేది బయటకు చెప్పొద్దని బిగ్ బాస్ చెప్తాడు.

అందరు గార్డెన్ ఏరియాలో ఉంటారు. మీరు సెలక్ట్ చేసుకున్న పర్సన్ ని ఇప్పుడు రివీల్ చేసే టైమ్ వచ్చింది. ఇది రణరంగం కాదు చదరంగం ఎక్కువ మంది ఓటు వేసిన వాళ్ళని కాకుండా చద్దనుకున్న వాళ్ళని హౌస్ లోకి పంపిస్తున్నానని బిగ్ ట్విస్ట్ ఇస్తాడు బిగ్ బాస్. దివ్య నిఖితా ని హౌస్ లోకి ఎంట్రీ చేపిస్తాడు బిగ్ బాస్. అసలు అందరు దివ్యని వద్దనుకున్నారు ఈ ట్విస్ట్ తో కంటెస్టెంట్స్ కి మైండ్ బ్లాంక్ అయింది. మీరందరు నన్ను వద్దనుకున్నారు కదా అని దివ్య అంటుంది. ఇక దివ్యకి నామినేషన్ పాయింట్స్ దొరికినట్లే. దివ్య నిఖిత ఎంట్రీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.