English | Telugu

Bigg Boss 9 Telugu : దివ్య కెప్టెన్సీ కంటెండర్స్.. రీతూ ఒక్కటే గెలిచింది!

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ కోసం నువ్వా నేనా అన్నట్టుగా కంటెస్టెంట్స్ పోటీపడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా కెప్టెన్సీ టాస్క్ కోసం సీక్రెట్ టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. దివ్య, సుమన్ శెట్టి ఇద్దరిని రెబల్స్ చెయ్యగా వాళ్ళకి రెండు సీక్రెట్ టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. అయితే వాళ్ళిద్దరూ సక్సెస్ ఫుల్ గా టాస్క్ ఫినిష్ చేస్తారు. ఫస్ట్ సీక్రెట్ టాస్క్ ఫినిష్ చేసి రెబల్ గా కళ్యాణ్ ని అట లో నుండి తొలగించారు.

ఇక ఆ తర్వాత రెబల్ గా బిగ్ బాస్ రీతూకి చెప్తాడు. తనకి రెండు సీక్రెట్ టాస్క్ లు ఇస్తాడు. ఒకటి ఎవరితో అయినా పెద్ద గొడవ పెట్టుకోవాలి. రెండోది ఇమ్మాన్యుయల్ ఫ్యామిలీ ఫోటోని కొట్టేయ్యాలి. అందులో ఒక టాస్క్ గెలిచి శ్రీనివాస్ సాయిని అట నుండి తొలగిస్తుంది. రెండో టాస్క్ ఫెయిల్ అవుతుంది. హౌస్ లో ఒకరికొకరు నువ్వే రెబల్ ఆ అంటూ ఒకరికొకరు అడుగుతారు కానీ ఎవరు బయటపడరు.

బిగ్ బాస్ మూడు టీమ్ లకి ఒక టాస్క్ ఇస్తాడు. అందులో ఆరేంజ్ టీమ్ విన్ అవుతుంది. వాళ్ళలో ఎవరికీ గ్రీన్ బ్యాడ్జ్ ఉంటుందో వాళ్ళలో ఒకరికి రెబల్ తొలగించే టాస్క్ నుండి తొలగించే ప్రక్రియ నుండి రిలీఫ్ అవుతారు. ప్రస్తుతం ఆ బ్యాడ్జ్ తనూజ దగ్గర ఉంటుంది. ఇమ్మాన్యుయల్, గౌరవ్ నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరు గొడవ పెట్టుకుంటారు కానీ రాము ఇలాంటి రియాక్ట్ లేకుండా డైరెక్ట్ నాకు వద్దని చెప్తాడు. దాంతో బ్యాడ్జ్ ని గౌరవ్ కి ఇస్తారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.