English | Telugu

Bigboss telugu 9 : బిగ్ బాస్ అగ్నిపరీక్షకి సెలెక్ట్ అయిన పదిహేను మంది కంటెస్టెంట్స్ ఎవరంటే!

బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ సీజన్(బిగ్ బాస్ సీజన్-9) ప్రారంభం కానుంది. దాంతో ఈ సీజన్ పై రోజురోజుకి క్యూరియాసిటి పెరుగుతుంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష కోసం పదిహేను మంది కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంపిక అయినట్లు తెలుస్తోంది. అందులో దాదాపు జనాలకి పెద్దగా తెలియని వాళ్ళే ఉన్నారు. ఈ పదిహేను మందిలో సగం మంది అగ్ని పరీక్షలో విన్ అయితే డైరెక్ట్ హౌస్ లోకి ఎంట్రీ టికెట్ వస్తుంది.

మరోవైపు సెలబ్రిటీలు ఎంత మంది హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారనేది ప్రస్తుతం అందరిలో ఉన్న ప్రశ్న.. ఈ సీజన్ అంతా డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు.. ఉంటే అది ఎలా ప్లాన్ చేసారో.. లేకపోతే ఏం చేస్తారో అని ఇలా బిగ్ బాస్ మొదలు నుండి ముగిసే వరకు ఎవరి ఊహాగానాలు వాళ్ళవి.. అయితే బిగ్ బాస్ అగ్నిపరీక్షకి పదిహేను మంది ఎంపికయ్యారు. అనూష రత్నం, దివ్య నిఖిత, శ్రేయ, శ్వేతా శెట్టి, డిమాన్ పవన్, ప్రసన్న కుమార్, దమ్ము శ్రీజ, మిస్ తెలంగాణ కల్కి, లాయర్ ప్రశాంత్, దాహిళా షరీఫ్, మాస్క్ మ్యాన్ హృదయ్, పవన్ కళ్యాణ్, మార్దయ మదన్, ప్రియ శెట్టి, ఇన్ ఫ్లూయెన్సర్ షకీర్ అగ్నిపరీక్షకి సెలక్ట్ అయినట్టు తెలుస్తోంది.

ఈ అగ్నిపరీక్షలో విన్ అయ్యి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేది ఎవరో తెలియాలంటే కొద్దీరోజులు ఆగాల్సిందే. ఈ పదిహేను మంది కూడా యూట్యూబ్ , ఇన్ స్టాగ్రామ్ లో ఎంతో కొంత ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు. ఈ కామన్ మ్యాన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎవరు సెలబ్రిటీగా మారుతారో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.