English | Telugu

bigg boss telugu 8: ఆర్జీవి స్టూడెంట్  సోనియా బిగ్ బాస్ లోకీ ఎంట్రీ...

తెలుగు బిగ్ బాస్ కి RGV కీ ఎదో తెలియని అనుబంధం వుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ప్రతీ సీజన్లో నా స్టూడెంట్ ని తీసుకోవాలని బిబి టీమ్‌తో‌ ఆర్జీవీ ముందే అగ్రిమెంట్ చేసుకున్నాడేమో. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ మాట అంటారు. RGV తో వీడియోలు చేసి వైరల్ అయి సెలబ్రిటీలుగా మారిన లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో అషురెడ్డి, అరియానా, ఇనాయ సుల్తానా వీళ్ళు కూడా ఆ కోవకి చెందినవారే. బిగ్ బాస్ సీజన్ మొదలవుతుందంటే RGV పిల్ల ఉండాల్సిందే‌ అన్నట్లుగా మారింది.

ఈ సీజన్ లో సోనియా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లోకి వెళ్లే వరకు కుడా ఆమె కనీసం ముఖపరిచయం కూడా లేని అమ్మాయి. స్టేజ్ పైకి ఎంట్రి ఇచ్చాక నాగార్జున ఒక సర్ ప్రైజ్ వీడియో చూపించాడు. RGV సోనియాని సపోర్ట్ చేస్తూ అల్ ది బెస్ట్ చెప్పిన వీడియోని బిగ్ స్క్రీన్ మీద చూపించాడు. సోనియా RGV స్టూడెంటే అని నాగార్జున ఆ వీడియో ప్లే చేసి‌ చూపేవరకు తెలియదు.

నటనలో నువ్వేంటో ప్రూ చేసుకున్నావ్.. ఇప్పుడు హౌస్‌లో కూడా నీ టాలెంట్ చూపిస్తావని నమ్ముతున్నాను. నువ్వు ఖచ్చితంగా టైటిల్ గెలుస్తావ్.. త్వరగా గెలిచి వచ్చేయ్.. మనం పార్టీ చేసుకుందామంటూ ఆర్జీవీ అన్నాడు. తనకి కరాటే, కలరి లాంటి విద్యలు కూడా వచ్చంటూ చెప్పింది సోనియా. బయట ఎవరి మీదైనా ట్రై చేశావా అంటూ నాగార్జున అడిగితే ఖచ్చితంగా చాలా మందికి పడ్డాయి అంటూ షాకిచ్చింది. మరి ఈ ఆర్జీవీ బ్యూటీ హౌస్ లో ఎలా పర్ఫామెన్స్ చేస్తుందో చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.