English | Telugu

డెలివరీ బాయ్ గా ఆదిరెడ్డి...వాళ్లకు కచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే

ఆదిరెడ్డి(adi reddy)అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ పర్సనాలిటీ. బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు అలాగే ఇప్పుడు ఇస్మార్ట్ జోడీ 3 సీజన్ కి కూడా వెళ్ళాడు. ఐతే రీసెంట్ గా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. ఒక ఫుడ్ యాప్ లో డెలివరీ బాయ్ గా చేరి ఆరోజు రెండు వేలు సంపాదించుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాడు. తెలిసిన డెలివరీ బాయ్ తో కలిసి అసలు డెలివరీస్ ఎలా చేయాలో తెలుసుకున్నాడు. నిజంగా డెలివరీ పార్ట్నర్స్ కష్టాలు మాములుగా లేవు..వాళ్లకు కచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అని చెప్పాడు. కొన్ని చోట్ల లిఫ్ట్ పని చేయక ఐదు ఫ్లోర్స్ కూడా ఎక్కి డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఉంది అని అన్నాడు. కొంతమంది ఫోన్ చేసి ఫుడ్ డెలివరీ ఇంత లేటా అంటూ తిడుతున్నారు.

ఇక రెస్పెక్ట్ సంగతి అడగక్కర్లేదు. ఎండా లేదు వాన లేదు దుమ్ము ధూళి మధ్య అన్ని హోటల్స్ కి వెళ్లి డెలివరీలు తీసుకుని పికప్ చేసుకోవడం..ఫైనల్ డెలివరీ బాయ్ డ్యూటీ అనేది చాలా కష్టం అని అర్ధమయ్యింది. ఐతే ఖాళీగా తిరిగే వాళ్లకు ఈ డెలివరీ బాయ్ జాబ్ చేసుకుంటే మినిమం ఒక 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పుకొచ్చాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.