English | Telugu

అరియానాకు సిరి అడ్డంగా దొరికిందిగా

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ముగిసింది. అయినా ఇంకా వార్త‌ల్లో నానుతూనే వుంది. కార‌ణం ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు వ్య‌వ‌హ‌రించిన తీరే. హౌస్‌లో సిరి, షన్నుల మ‌ధ్య జ‌రిగిన ట్రాక్ ఇప్ప‌టికీ హాట్ టాపిక్ గానే కొన‌సాగుతోంది. దీనిపై బిబి4 సీజ‌న్ కంటెస్టెంట్, బిగ్‌బాస్ బ‌జ్ హోస్ట్ అరియానా గ్లోరి త‌న‌దైన స్టైల్లో స్పందించింది. సిరితో ప్ర‌త్యేకంగా మాట్లాడిన అరియానా ఓ విధంగా చెప్పాలంటే సిరిని చెడుగుడు ఆడేసుకుంద‌ని చెప్పొచ్చు.

హౌస్‌లో సిరి, ష‌న్ను స‌మ‌యం చిక్కితే చాలు ఫ్రెండ్షిప్ హ‌గ్ అంటూ వ‌రుస హ‌గ్గుల‌తో ర‌చ్చ ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో వీరిపై నెటిటివిటీ మొద‌లైంది. అంత వ‌ర‌కు స‌పోర్ట్ గా నిలిచిన ప్రేక్ష‌కులు ఒక్క‌సారిగా స‌న్నీ వైపు తిరిగి అత‌న్ని స‌పోర్ట్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ సిరిని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేసింది అరియానా. హౌస్ లో స‌న్నీని టార్గెట్ చేశావా? అని అరియానా అడిగితే లేదు అని చెప్పింది సిరి. టాస్కుల్లో గొడ‌వ‌లు జ‌రుగుతుండ‌టంతో అత‌నితో ఫ్రెండ్షిప్ చేసే అవ‌కాశం ఎలా వుంటుంద‌ని సిరి చెప్ప‌డంతో మ‌రి ష‌న్నుతో కూడా జ‌రిగింది అంత‌కు మించి క‌దా అని పంచ్ ఏసింది.

Also read:సిరి, ష‌న్ను రిలేష‌న్ పై స‌న్నీ కామెంట్

ర‌విని నామినేట్ చేశారు. అత‌ను వెళ్లిపోగానే అత‌ని కోస‌మే గేమ్ ఆడుతున్నామ‌ని అని చెప్ప‌డం ఏంటీ? అని అడిగింది అరియానా.. దీంతో సిరికి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది. ఇక ఫైన‌ల్ గా చోటు కావాలా? ష‌న్ను కావాలా అంటే ఇద్ద‌రిలో ఎవ‌రిని ఎంచుకుంటావ‌ని సిరికి దిమ్మ‌దిరిగే పంచ్ వేసింది అరియానా. అయితే అరియానా ఊహించిన‌ట్టే ఆ ప్ర‌శ్న‌కు ఏం స‌మాధానం చెప్పాలో తేల్చుకోలేక మౌనంగానే చూస్తుండి పోయింది సిరి. తాజా ఎపిసోడ్ కి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.