English | Telugu

యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం...

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెర మీద శ్రీముఖి, రష్మీ హవానే కొనసాగుతోంది. అలాంటి యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రష్మీ తాతయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఎంతో ఇష్టమైన తాతయ్య మరణన్ని తట్టుకోలేకపోతున్నానని రష్మి ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది. తన బామ్మ తలకు తాతయ్య నూనెతో మర్దన చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.. ‘మా తాత అచ్చమైన స్త్రీవాది. ఫైనల్ గా ఆయన స్వర్గంలో మా బామ్మను కలుసుకున్నారు. ఆగస్టు 17 న మా తాతయ్య ఆనారోగ్యంతో మరణించారు. ఆయనకు తుది వీడ్కోలు పలికాం.

మా బామ్మ తాతయ్యల మనసులు విడదీయలేనివి. మా బామ్మ భౌతికంగా దూరమయ్యాక మా తాతయ్య చాలా బాధపడుతూనే ఉన్నారు. ఏడాదిన్నర నుంచి ఆమె గురించిన జ్ఞాపకాలనే మాకు పదేపదే చెప్పేవాడు. మా బామ్మ మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది’ అని రష్మీ ఒక హార్ట్ టచింగ్ లైన్స్ రాసింది. రష్మీ షేర్ చేసిన పోస్ట్ పై చూసి ఫాన్స్ , నెటిజన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటూ ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మీ తన అందంతో వచ్చి రాని తెలుగుతో బాగా ఫేమస్ అయ్యింది. ఇక ఆ తర్వాత వెండితెరపై మెరవాలనుకుంది కానీ అదృష్టం కలిసి రాలేదు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.