English | Telugu

అదిరే అభి కాళ్ళు కడిగిన హైపర్ ఆది..


జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. 12 ఇయర్స్ మెగా సెలెబ్రేషన్స్ జరిగాయి. ఇక ఇందులో ఎవరి గురువులకు వాళ్ళు కాళ్ళు కడిగి వాళ్ళ అభిప్రాయాన్ని వెల్లడించారు. ముందుగా ఐతే అదిరే అభి కాళ్ళు కడిగాడు హైపర్ ఆది. "నువ్వేం సాధించావ్ లైఫ్ లో అని ఎవరైనా అడిగితే ఆది నా శిష్యుడు అని చెప్పడానికి నాకు గర్వంగా ఉంటుంది..." అన్నాడు. "నేను గర్వంగా చెప్పుకునేది ఏంటి అంటే ఒకసారి మా అమ్మానాన్నను హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ చూసి మీరు చాలా అదృష్టవంతులు మీకు ఇలాంటి కొడుకు ఉన్నందుకు" అన్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

తర్వాత చమ్మక్ చంద్రకి ఆయన శిష్యులంతా లేడీ గెటప్స్ తో వచ్చి కాళ్ళు కడిగారు. "ధన్రాజ్, వేణు ఆర్టిస్టులు అయ్యారు..మా టీమ్ లో చేరిన తాగుబోతు రమేష్ కూడా ఆర్టిస్ట్ అయ్యాడు. కానీ నేను కావట్లేదు. ఆ టైములో నేను బాధలో ఉన్నప్పుడు నాకు జబర్దస్త్ ఆఫర్ వచ్చింది. అప్పుడి ఒక్కటే అనుకున్నా నా లైఫ్ అండ్ డెత్ ప్రోగ్రాం ఇది అని" చెప్పాడు. తర్వాత రాఘవ గారికి కూడా వాళ్ళ శిష్యులు వచ్చి కాళ్ళు కడిగారు. ఇక హారిక అనే సింగర్ జబర్దస్త్ మీద టీమ్ లీడర్స్ పేర్లు వచ్చేలా వాళ్ళు చేసిన బెస్ట్ స్కిట్స్ ని తీసుకుని మంచి పాట తయారు చేసి పాడి వినిపించింది. ఇక ఈ షోకి రోజా రాకపోయినా కూడా ఆమె మీద కూడా కొన్ని లిరిక్స్ రాసి జబర్దస్త్ ఈ పదేళ్ల జర్నీ మీద ఆమె పాడిన ఈ మంచి సాంగ్ కి అందరూ ఫిదా ఇపోయారు. ఇక చమ్మక్ చంద్ర ఐతే "మా ఫామిలీ మీద మా జబర్దస్త్ మీద ఫస్ట్ టైం సాంగ్ విన్నాం చాలా చక్కగా ఉంది" అన్నాడు. "మీరు పాడుతుంటే ఆ మిస్సింగ్ ఫీలింగ్ అందరిలో తెప్పించారు..అంత బ్యూటిఫుల్ గా పాడారు" అంటూ ఇంద్రజ కామెంట్ చేసింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.