English | Telugu

దీన్ని చూసేటప్పుడు తినొద్దు, తాగొద్దు!

స్టార్ మాతో సమానంగా పోటాపోటీగా జీ తెలుగు కూడా ఎన్నో కొత్త కొత్త షోస్ ని ఆడియన్స్ ముందుకు తెస్తోంది. ప్రతీ వారం ఏదో ఒక వెరైటీ కంటెంట్ తో జీ తెలుగు అందరి ముందుకు వచ్చేస్తోంది. ఇక ఇప్పుడు జీ సూపర్ ఫామిలీ కొత్త ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ సూపర్ ఫామిలీలో ఒక షోకి ఇంకో షోకి మధ్య టగ్ ఆఫ్ వార్ నిర్వహిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ చేస్తున్నాడు.

ఈ ప్రోమోలో 'అదిరింది' టీమ్, 'సరిగమప' టీమ్ పోటీపడుతున్నాయి. రెండు టీమ్స్ నుంచి కంటెస్టెంట్స్ వచ్చారు. ఈ రెండు టీములు కూడా ప్రదీప్ మీద ఫుల్ పంచ్ డైలాగ్స్ వేసేసరికి ప్రదీప్ కూడా రివర్స్ కౌంటర్లు వేస్తూ ఫన్ చేసాడు. 'అదిరింది' టీమ్ నుంచి సద్దాం టీమ్ ఆడియన్స్ కి సందడి పంచింది. షో స్టార్టింగ్ లోనే "జీ" అనే పేరువచ్చేలా కొన్ని పదాలు వాడి ఎంటర్టైన్ చేశారు.

జీ అంటే చిన్నపిల్లలు బాత్రూం కి కూర్చోపెట్టేటప్పుడు వాడే మాటను వీళ్లంతా కలిసి కొన్ని పదాలతో కలిపి అలా పలుకుతూ ఎంటర్టైన్ చేశారు. అందుకే ప్రోమో ముందు ఒక టాగ్ కూడా పెట్టేసారు "డోంట్ ఈట్ ఆర్ డ్రింక్ వైల్ వాచింగ్ థిస్ ప్రోమో" అని. కనిపిస్తుంది. ఇక తర్వాత సరిగమప టీమ్ కంటెస్టెంట్స్ అంతా వచ్చి మంచి మంచి సాంగ్స్ పాడుతూ డాన్సులు చేసి మైమరిపించారు. తర్వాత బొమ్మలు వేయించి వాటిని గుర్తుపట్టమని చెప్పే టాస్క్.

ఇలా రెండు టీమ్స్ కి వెరైటీ టాస్కులు ఇచ్చి గేమ్స్ ఆడించి ఎంటర్టైన్ చేసాడు ప్రదీప్. ఈ ఎపిసోడ్ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. సద్దాం టీమ్ లో ఒకత‌ను నిజాలన్నీ చెప్పేస్తాడు. తమిళనాడు ఆంటీ, ఓయో రూమ్ అంటూ సీక్రెట్స్ లీక్ చేసేస్తాడు సద్దాం. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.